ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ప్రభుత్వానికి లేదు: Lokesh

ABN, First Publish Date - 2021-12-23T18:26:40+05:30

రైతుల్ని అన్నివిధాలా అన్యాయం చేసిన ఈ ప్రభుత్వానికి రైతు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రైతుల్ని అన్నివిధాలా అన్యాయం చేసిన ఈ ప్రభుత్వానికి రైతు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అన్నదాతలకు టీడీపీ నేత శుభాకాంక్షలు తెలియజేశారు. రైతు రాజ్యం తెస్తానన్న జగన్ రెడ్డి రైతులేని రాష్ట్రంగా మార్చేశారని ఆయన విరుచుకుపడ్డారు. విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని... పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని అన్నారు. ధాన్యం బకాయిలు చెల్లించరని, అబద్దపు హామీలతో రైతులను ముంచారని ఆరోపించారు. కనీసం నచ్చిన పంట వేసుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదంటే రైతాంగం ఎంత గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటుందో అర్ధమవుతుందని లోకేష్ పేర్కొన్నారు.  


Updated Date - 2021-12-23T18:26:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising