ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను అడ్డంపెట్టుకొని కక్ష సాధింపుకు దిగుతున్నారు : కళా వెంకట్రావ్

ABN, First Publish Date - 2021-05-08T00:57:23+05:30

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయడంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయడంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంక్రటావ్ మండిపడ్డారు. కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎన్440కే వైరస్ పై ఈ నెల 4న హిందూ దినపత్రికలో వచ్చిన కథనాన్నే చంద్రబాబు ఉటంకించారని, కరోనాపై సాధారణ పౌరులైనా తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించవచ్చని సుప్రీం పేర్కొందని గుర్తు చేశారు. కరోనాను అడ్డుపెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యల్లో సీఎం జగన్ నిమగ్నమయ్యారని మండిపడ్డారు. ధూళిపాళ నరేంద్ర, దేవినేని ఉమపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఆక్సిజన్, వెంటిలేటర్లు,మందులు దొరక్క వందలాది మంది చనిపోతున్న మాట వాస్తవం కాదా? అని వెంకట్రావు ప్రశ్నించారు. శ్మశానాల్లో శవాలను కాల్చడానికి కూడా స్థలం లేక క్యూలు కడుతున్న మాట నిజం కాదా? అని కిమిడి కళా వెంకట్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

Updated Date - 2021-05-08T00:57:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising