ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్కేపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రభుత్వ దిగజారుడుతనానికి పరాకాష్ట: Devathoti

ABN, First Publish Date - 2021-12-13T16:47:10+05:30

ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రభుత్వ దిగజారుడుతనానికి పరాకాష్ట అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రభుత్వ దిగజారుడుతనానికి పరాకాష్ట అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ సీఐడీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవస్థ కోసం కాకుండా స్వార్థపూరిత వ్యక్తుల కోసం పనిచేయడం రాష్ట్ర తిరోగమనానికి పునాదని వ్యాఖ్యానించారు. జీరో ఎఫ్ఐఆర్ వంటి అరుదైన కేసును.. రాధాకృష్ణపై అన్యాయంగా, అక్రమంగా ప్రయోగించడం ప్రభుత్వ రంగ సంస్థల పతనానికి నాందన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని, అన్యాయాలను, అక్రమాలను  బయట పెడుతున్నారని రాధాకృష్ణపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపించాల్సిన ప్రభుత్వ అధికారులు.. మీడియా రంగంలో అత్యున్నత స్థానంలో ఉన్న రాధాకృష్ణ లాంటి వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏoటి అని దేవతోటి నాగరాజు ప్రశ్నించారు. 

Updated Date - 2021-12-13T16:47:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising