ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైదుకూరు టీడీపీ చైర్మన్‌ అభ్యర్థి అరెస్టు

ABN, First Publish Date - 2021-03-06T09:47:21+05:30

కడపలోని మైదుకూరు మున్సిపాలిటీ టీడీపీ చైర్మన్‌ అభ్యర్థి ధనపాల జగ న్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఆయన తన ఇంటి కి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారంటు, నోటీసివ్వకుండా తీసుకెళ్లిన వైనం

ప్రచారానికి దూరంగా ఉంచాలనే: పుట్టా 


కడప, మార్చి 5(ఆంధ్రజ్యోతి): కడపలోని మైదుకూరు మున్సిపాలిటీ టీడీపీ చైర్మన్‌ అభ్యర్థి ధనపాల జగ న్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఆయన తన ఇంటి కి చేరుకున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడుతుం డగా రాత్రి 9:30 సమయంలో పోలీసులు వచ్చారు. మైదుకూరు డీఎస్పీ విజయకుమార్‌తోపాటు 50 మందికిపైగా పోలీసులు ధనపాల ఇంటిని చుట్టుము ట్టారు. తననెందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని.. ముందుగా నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని పోలీసులను ప్రశ్నించారు. ఏ కేసులో అరెస్టు చేస్తు న్నా రో చెప్పాలన్నారు. టీడీపీ మైదుకూరు ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అక్కడకు చేరుకుని కనీస సమాచా రం లేకుండా ఎలా అరెస్టు చేస్తారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ పోలీసులు రాత్రి 11 గంటల సమయంలో జగన్‌ను బలవంతం గా తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు, టీడీపీ కార్య కర్తలు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ జగన్‌ లేకపోవడంతో వారంతా రోడ్డుపై బైఠాయించి, ధర్నా కు దిగారు. కాగా.. జగన్‌ను పోలీసులు వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు.


ఆ రోజు ఏం జరిగింది..? 

మైదుకూరు 1వ వార్డుకు వైసీపీ అభ్యర్థి సునీత, టీడీపీ అభ్యర్థి వెంకటలక్షుమమ్మ, స్వతంత్ర అభ్యర్థి విజయలక్ష్మి నామినేషన్లు వేశారు. 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిసింది. 4 గంటల సమ యంలో టీడీపీ అభ్యర్థి వెంకటలక్షుమమ్మ, స్వతంత్ర అభ్యర్థి విజయలక్ష్మి ఆర్వో గదిలోకి వెళ్ల్లారు. ఈ విష యం తెలుసుకున్న ధనపాల జగన్‌ ఆర్వో వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అయినా ఆ య న లోనికి వెళ్లారు. గడువు ముగిసినా విత్‌డ్రాకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఇంతలో అక్కడున్న పోలీసు అధికారులు జగన్‌ను గేటు వరకు తోసు కుం టూ తీసుకెళ్లారు. అయితే తనపట్ల జగన్‌ దురుసుగా ప్రవర్తించారని.. ఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయ న్ను అరెస్టు చేసినట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలి పారు. ఆ వీడియోను పరిశీలిస్తే ఎక్కడా పోలీసులను తోసుకుంటూ వెళ్లినట్లు కనిపించడం లేదు. నిజంగా ఆ రోజు ఆయన ఆర్వో పట్ల దురుసుగా ప్రవర్తించినా, వి ధుల్లో ఉన్న అధికారులను తోసుకుంటూ వెళ్లినా అదే రోజు ఫిర్యాదు చేసి.. అరెస్టు చేసి ఉండవచ్చు. కానీ, 3 రోజుల తర్వాత అరెస్టు చేయడం గమనార్హం.

Updated Date - 2021-03-06T09:47:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising