ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బి ఫారాలన్నీ కలిపివ్వడానికి అనుమతి ఇవ్వాలి: టీడీపీ

ABN, First Publish Date - 2021-03-02T08:59:11+05:30

ఒక జిల్లాలో లేదా ఒక మునిసిపాలిటీలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరి బి ఫారాలను కలిపి ఒకేసారి సంబంధిత ఎన్నికల అధికారికి సమర్పించడానికి అనుమతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఒక జిల్లాలో లేదా ఒక మునిసిపాలిటీలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరి బి ఫారాలను కలిపి ఒకేసారి సంబంధిత ఎన్నికల అధికారికి సమర్పించడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పి.అశోక్‌ బాబు సోమవారం ఈ మేరకు ఎస్‌ఈసీకి లేఖ రాశారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవాలని చూసిన వైసీపీ నేతలు అందులో విఫలమైన చోట్ల ఇప్పుడు బి ఫారాలు ఇవ్వకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. తాము పోటీ చేస్తున్న చోట ఎన్నికల అధికారికి బి ఫారం ఇవ్వకుండా అడ్డుకోవడానికి... లేదా లాక్కొని చించి వేయడానికి పథక రచన చేస్తున్నారని, ఇది కూడా సాధ్యం కాకపోతే ఎన్నికల అధికారులను ఆకట్టుకొని వారి దగ్గరకు వచ్చిన బి ఫారాన్ని వారి చేతితోనే చించి వేయించాలని కూడా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనికి విరుగుడుగా మొత్తం అభ్యర్థులందరి బి ఫారాలు తాము ఒకేసారి జిల్లా ఎన్నికల అధికారికి లేదా మునిసిపాలిటీ ఎన్నికల అధికారికి సమర్పించాలని అనుకొంటున్నామని, దీనికి అనుమతించాలని అశోక్‌ బాబు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-03-02T08:59:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising