ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత గిరిజనుల కోసం శారదపీఠం తిరుమల యాత్ర

ABN, First Publish Date - 2021-03-29T22:23:47+05:30

ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తామని శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తామని శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యానించారు. సోమవారం శారదా పీఠం ఆధ్వర్యంలో, సాత్మానంద సరస్వతి, 1200 మంది దళిత గిరిజనులను తిరుపతి దర్శనానికి తీసుకెళ్తున్న 25  బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా స్వరూపానంద సరస్వతి మాట్లాడుతూ..  హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. సన్యాసం స్వీకరించిన తర్వాత బాలస్వామి తెలంగాణ రాష్ట్రంలో దిగ్విజయంగా యాత్ర చేశారన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో మా యాత్రకు పట్టాభిషేకం చేశారని పేర్కొన్నారు. 


ఆంధ్రప్రదేశ్‌లోనూ దిగ్విజయంగా యాత్ర పూర్తయిన సందర్భంలో అరకు పాడేరు‌కు చెందిన 1200 మంది దళిత గిరిజన సోదరులను తిరుపతి దర్శనానికి పంపుతున్నామని  స్వరూపానంద సరస్వతి తెలిపారు. దేవాలయాల్లో అలజడులు జరుగుతున్నా శారదా పీఠం స్పందించలేదని.. గల్లీకి కూడా పనికిరాని కొంతమంది విమర్శలు చేస్తున్నారని స్వరూపానంద సరస్వతి ఆగ్రహం  వ్యక్తం చేశారు.  దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడడంలోనూ, అన్యమత ప్రచారాన్ని అడ్డుకట్టవేసేందుకు జీవో  తీసుకురావడంలో శారదా పీఠం ఎంతో కృషి చేసిందని చెప్పారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా జరుగుతోన్న అవినీతిని సైతం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని స్వరూపానంద సరస్వతి స్పష్టం చేశారు. 

Updated Date - 2021-03-29T22:23:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising