ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిషత్‌ ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: వర్లరామయ్య

ABN, First Publish Date - 2021-04-08T00:18:14+05:30

పరిషత్‌ ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని టీడీపీ నేత వర్లరామయ్య ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పరిషత్‌ ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని టీడీపీ నేత వర్లరామయ్య ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. హైకోర్టు ధర్మాసనం నిర్ణయాన్ని అప్పీల్‌ చేస్తామని పేర్కొన్నారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికలను నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే తాము ఎన్నికలను బహిష్కరించామని వర్లరామయ్య తెలిపారు.


జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కౌంటింగ్‌ జరపొద్దని హైకోర్టు ఆదేశించింది. సింగిల్‌ జడ్జి వద్దకు వెళ్లి పిటిషన్‌ను పరిష్కరించుకోవాలని ధర్మాసనం సూచించింది. దీంతో ఏప్రిల్ 8న యథావిధిగా పరిషత్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన స్టేని డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది. ఈ కేసులో ఎస్ఈసీ తరఫున సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించగా, పిటిషనర్ వర్ల రామయ్య తరపున సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలను వినిపించారు. 

Updated Date - 2021-04-08T00:18:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising