ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ABN, First Publish Date - 2021-07-19T22:21:41+05:30

అమరావతి భూముల కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదంటూ హైకోర్టు తీర్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: అమరావతి భూముల కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును జగన్ సర్కార్ సుప్రీంలో సవాల్‌ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి భూముల కొనుగోలు కేసులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగలేదంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. సుప్రీంకోర్టులో అమరావతి భూముల కొనుగోలుపై వాదనలు ముగిశాయి. వాదనలు ముగిసిన అనంతరం జస్టిస్ వినీత్ సరన్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అమరావతి భూములపై దాఖలైన పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ వాదనలు ప్రారంభించారు. భూముల బదలాయింపు చట్టం ప్రకారం కొనుగోలుదారులు... భూములను ఎందుకు కొనుగోలు చేస్తున్నారో అమ్మకందారులకు చెప్పాలన్నారు. ఈ విషయంలో అమ్మకం దారులు మోసపోయారని.. కొనుగోలుదారులు ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై భూములను కొనుగోలు చేశారని దుష్యంత్ పేర్కొన్నారు. 



Updated Date - 2021-07-19T22:21:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising