ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టులకు ముందుగానే వేసవి సెలవులు

ABN, First Publish Date - 2021-05-06T09:16:45+05:30

కరోనా నేపథ్యంలో హైకోర్టుతో పాటు దిగువ న్యాయస్థానాలకు మరింత ముందుగా వేసవి సెలవులను ప్రకటించారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో హైకోర్టుతో పాటు దిగువ న్యాయస్థానాలకు మరింత ముందుగా వేసవి సెలవులను ప్రకటించారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైకోర్టుకు ఈ నెల 10 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులుగా పేర్కొన్నారు. మొదట ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 14 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో మరో మూడు రోజులు అదనంగా సెలవులు ఇచ్చారు. ఇందుకు బదులుగా అక్టోబర్‌ 23 (శనివారం)తో పాటు సెలవులుగా ప్రకటించిన నవంబర్‌ 3, 5 తేదీలను పనిదినాలుగా పేర్కొన్నారు. మరోవైపు దిగువ న్యాయస్థానాల్లోని అన్ని కోర్టులు, సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులకు గతంలో ఈ నెల 14 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తాజాగా ఈ నెల 10 నుంచి జూన్‌ 8 వరకు సెలవులు ఇచ్చారు. 

Updated Date - 2021-05-06T09:16:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising