చక్కెర ఫ్యాక్టరీలకు పీఐల కొనసాగింపు
ABN, First Publish Date - 2021-03-05T09:17:33+05:30
రాష్ట్రంలోని సహకార చక్కెర ఫ్యాక్టరీలకు అధికారిక పర్సన్ ఇన్‌చార్జిలను మరో 6నెలలు కొనసాగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని సహకార చక్కెర ఫ్యాక్టరీలకు అధికారిక పర్సన్ ఇన్‌చార్జిలను మరో 6నెలలు కొనసాగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జనవరి 1నుంచి జూన్ 30వరకు ఈ ఉత్తర్వులు అమలవుతాయని పరిశ్రమలశాఖ పేర్కొంది. విశాఖ జిల్లా గోవాడలోని చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి విశాఖ కలెక్టర్, ఏటికొప్పాక, భీమసింగి, పాయకరావుపేట, తుమ్మపాల, చిత్తూరు, కొవూరు(నెలూరు) చక్కెర ఫ్యాక్టరీలకు ఆయా జిల్లాల రైతుభరోసా జేసీలు పర్సన్ ఇన్‌చార్జిలుగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Updated Date - 2021-03-05T09:17:33+05:30 IST