ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Andhra pradesh కు మోదీ సర్కార్ మొండిచేయి..!

ABN, First Publish Date - 2021-12-31T08:29:27+05:30

Andhra pradesh కు మోదీ సర్కార్ మొండిచేయి.. అయినా కేంద్రం కనికరించలేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అదనపు వరద సాయంలో.. 
  • ఆరు రాష్ట్రాలకు 3,063 కోట్లు
  • కేంద్ర ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం
  • అమిత్‌షా అధ్యక్షతన భేటీ
  • 5 వేల కోట్లు అడిగిన రాష్ట్రం
  • తక్షణ సాయంగా 1,000 కోట్లు 
  • కోరినా పైసా విదల్చలేదు..

న్యూఢిల్లీ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన తుఫాను, వరదలు, భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన ప్రాంతాలను ఆదుకోకుండా కేంద్రం మొండిచేయి చూపింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన గురువారం జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఆరు రాష్ర్టాలకు అదనపు వరద సాయం కింద రూ.3,063.21 కోట్లు ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. జాతీయ విపత్తుల నిర్వహణ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) కింద గుజరాత్‌కు రూ.1,133.35 కోట్లు, పశ్చిమ బెంగాల్‌-రూ.586.59 కోట్లు, అసోం-రూ.51.53 కోట్లు, కర్ణాటక-రూ.504.06 కోట్లు, మధ్యప్రదేశ్‌-రూ.600.50 కోట్లు, ఉత్తరాఖండ్‌కు రూ.187.18 కోట్ల వంతున విడుదలకు నిర్ణయించింది. మన రాష్ట్రానికి పూచిక పూల్లయినా దక్కలేదు. నవంబరు, డిసెంబరుల్లో ప్రకృతి విపత్తుల కారణంగా రాష్ట్రంలో రూ.వందల కోట్ల విలువైన పంటలు, ఉద్యానవనాలు, ఆస్తులు భారీగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది పశువులు మరణించడం లేదా గల్లంతవడం జరిగింది. వరద నష్టం కింద రాష్ట్రప్రభుత్వం రూ.5 వేల కోట్లివ్వాలని కోరింది. ఇందులో తక్షణ సాయంగా రూ.1,000 కోట్లు ఇవ్వాలని కూడా అడిగింది. అయినా కేంద్రం కనికరించలేదు.

Updated Date - 2021-12-31T08:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising