ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐక్య పోరాటాలతోనే ‘ఉక్కు’ పరిరక్షణ

ABN, First Publish Date - 2021-07-26T09:00:18+05:30

కార్మికుల ఐక్య పోరాటాలతోనే స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ సాధ్యమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ సీహెచ్‌.నరసింగరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పోరాట కమిటీ చైర్మన్‌ నరసింగరావు
  • నిర్వాసిత కాలనీల్లో ఉద్యోగుల పాదయాత్ర

కూర్మన్నపాలెం(విశాఖపట్నం), జూలై 25: కార్మికుల ఐక్య పోరాటాలతోనే స్టీల్‌ప్లాంట్‌  పరిరక్షణ సాధ్యమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ సీహెచ్‌.నరసింగరావు అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు ఉద్యోగులు ఆదివారం నిర్వాసిత కాలనీల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రను కూర్మన్నపాలెం జంక్షన్‌లోని ఆందోళన శిబిరం వద్ద నరసింగరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు డి.ఆదినారాయణ మాట్లాడుతూ తాము ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాజకీయ పార్టీల ప్రముఖులను కలిసి సమస్యను వివరించామని తెలిపారు. పోరాట కమిటీ నాయకుడు మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ, ఆగస్టు 2,3 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు చెప్పారు. పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ ఆందోళనలో పాల్గొంటున్న ఉద్యోగులను ఉన్నతాధికారులు భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు.

Updated Date - 2021-07-26T09:00:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising