ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి కైంకర్యాల్లో అవకతవకలు లేవు

ABN, First Publish Date - 2021-10-15T06:56:19+05:30

తిరుమలలో శ్రీవారి సేవలు, కైంకర్యాలు, పూజల్లో అవకతవకలు జరగడం లేదని, సంప్రదాయం ప్రకారమే అన్నీ జరుగుతున్నాయని టీటీడీ స్పష్టం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): తిరుమలలో శ్రీవారి సేవలు, కైంకర్యాలు, పూజల్లో అవకతవకలు జరగడం లేదని, సంప్రదాయం ప్రకారమే అన్నీ జరుగుతున్నాయని టీటీడీ స్పష్టం చేసింది. ఆగమ శాస్త్రంపూజలు జరగడం లేదంటూ శ్రీవారి దాదా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ‘‘తిరుమల దేవాలయంలో ఆగమశాస్త్రం ప్రకారం సేవలు, ఉత్సవాలను నిర్వహించే వ్యవస్థను 10వ శతాబ్దంలో శ్రీరామానుజాచార్య ప్రారంభించారు. ఆ పరంపరను కొనసాగిస్తున్న పెద్దజీయంగార్‌, చిన్నజీయంగార్‌ స్వాముల పర్యవేక్షణలో వైఖానస ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అర్చకులు స్వామివారి సేవలు, ఉత్సవాలను నిర్వహిస్తారు. అర్చకులతో పాటు ఆయా మతపరమైన వ్యవహారాల్లో టీటీడీకి సలహాలు ఇవ్వడానికి ఎప్పటికప్పుడు నిష్ణాతులైన పండితులతో ఆగమ సలహా కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. కైంకర్యాల నిర్వహణకు అర్చకులకు, పెద్దజీయంగార్‌ స్వామికి అవసరమైన మౌలిక సదుపాయాలు, మద్దతును టీటీడీ అందిస్తోంది’’ అని పేర్కొన్నారు. పిటిషనర్‌ లేవనెత్తిన ఆరోపణల్లో వాస్తవం లేదని, దురుద్దేశంతో పిటిషన్‌ దాఖలు చేశారని అఫిడవిట్‌లో టీటీడీ ఈవో వివరించారు. 

Updated Date - 2021-10-15T06:56:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising