ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒడిశా దూకుడుకు కళ్లెం పడేనా.. జగన్ సర్కార్ నిర్ణయమేంటో..!?

ABN, First Publish Date - 2021-10-26T04:34:09+05:30

ఒడిశా ప్రభుత్వ అధికారులు.. పోలీసు యంత్రాంగం కొద్దిరోజులుగా దూకుడు ప్రదర్శిస్తోంది. కొఠియా గ్రామాలవైపు ఆంధ్రా అధికారులు, నేతలు, గిరిజనులను రానీయడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. పిల్లలకు వేయాల్సిన వ్యాక్సినలకూ సహకరించడం లేదు. పైగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో భయాందోళన చెందుతున్న కొఠియా గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు సోమవారం జిల్లా నేతలు, అధికారులను కలిశారు. తమ సమస్యలను విన్నవించారు.

కొఠియా వాసులను సన్మానిస్తున్న కలెక్టర్‌ సూర్యకుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కొఠియా వాసులకు రక్షణ, అభివృద్ధికి భరోసా లభించేనా
  •  స్థానిక ప్రజాప్రతినిధుల్లో ఆందోళన
  • రక్షణ కల్పించాలని అధికారులకు విన్నపాలు

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

 ఒడిశా ప్రభుత్వ అధికారులు.. పోలీసు యంత్రాంగం కొద్దిరోజులుగా దూకుడు ప్రదర్శిస్తోంది. కొఠియా గ్రామాలవైపు ఆంధ్రా అధికారులు, నేతలు, గిరిజనులను రానీయడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. పిల్లలకు వేయాల్సిన వ్యాక్సినలకూ సహకరించడం లేదు. పైగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో భయాందోళన చెందుతున్న కొఠియా గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు సోమవారం జిల్లా నేతలు, అధికారులను కలిశారు. తమ సమస్యలను విన్నవించారు. దశాబ్దాలుగా ఆంధ్రా పరిధిలోనే ఉంటున్నామని, ఇక్కడే ఓటు హక్కు, రేషను కార్డు, ఆధార్‌ కార్డులనే వినియోగిస్తున్నామని తెలిపారు. ఐటీడీఏ ఇచ్చిన పోడు భూములను సాగు చేసుకుంటున్నామని... ఆంధ్రా పరిధిలోనే ఉంటామని స్పష్టంచేశారు. వారి ఆశలకు తగినట్టుగా మన రాష్ట్ర అధికారులు, నేతల నుంచి ఏ మేరకు భరోసా లభిస్తుందో చూడాలి. ఐటీడీఏకు, కలెక్టరేట్‌కు వచ్చిన కొఠియా సర్పంచులు, ఎంపీటీసీలను జిల్లా అధికారులు సన్మానించారు. తొలుత సాదరంగా ఆహ్వానించి వారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. 


గతం నుంచీ వివాదం..

ఒడిశాతో సరిహద్దు వివాదం మాద్రాస్‌ ప్రెసిడెన్సీగా ఉన్ననాటి నుంచీ కొనసాగుతోంది. ఒడిశాకు చెందిన ’కొఠియా’ గ్రామ పంచాయతీలో 34 హ్యామ్లెట్‌ గ్రామాలున్నాయి. వీటిలో 21 గ్రామాల విషయంలోనే స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి సరిహద్దు వివాదం నడుస్తోంది. ఈ 21 గ్రామాలు సాలూరు మండలానికి చెందిన గంజాయిభద్ర, పగులుచెన్నేరు, సారిక, కురుకూటి పంచాయతీల పరిధిలో ఉన్నాయి. 1968 డిసెంబరు 2న సుప్రీంకోర్టు సరిహద్దు వివాదం కేసుపై స్పష్టత ఇచ్చింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించింది. అంతవరకు వివాదాస్పద ప్రాంతాన్ని తటస్థంగా ఉంచాలని చెప్పింది. ఆ తర్వాత కొన్నాళ్ల వరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఒడిశా, ఆంధ్రా రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ చేపడుతూ వచ్చాయి.  కొద్ది సంవత్సరాలుగా మాత్రం ఒడిశా నిబంధనలకు విరుద్ధంగా కొఠియాలో తిష్టవేయాలని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఇటీవల మరో అడుగు వేసి కోట్లాది రూపాయలతో బీటీ రోడ్లు, ప్రభుత్వ కార్యాలయ భవనాలు, పాఠశాల భవనాలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణం చేపట్టింది. ఈ విషయంలో మన అధికారులు, ప్రజాప్రతినిధులు వెనుకబడ్డారు. దీంతో ఒడిశా మరింత దూకుడు పెంచింది. భూగర్భ గనులు పుష్కలంగా ఉన్న ప్రాంతాలను విడిచి పెట్టేందుకు ఇష్టపడటం లేదు. ఈ క్రమంలోనే మన రాష్ట్రం నుంచి వివాదాస్పద గ్రామాల్లోకి వెళ్లిన మన అధికార యంత్రాంగాన్ని అడ్డుకోవటం ప్రారంభించింది.


మరింత దూకుడుగా..

ఈ ఏడాది ఫిబ్రవరి 13న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఓటు వేయకుండా పోలీసు దళాలతో స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఒడిశాకు చెందిన అధికార, ప్రతిపక్షాల ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు గ్రామాల్లో పర్యటించి మన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో ఎస్పీ ప్రత్యేకంగా పోలీసు బలగాలను పంపించి నిఘా నడుమ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఏప్రిల్‌ 8న ఎంపీటీసీ, జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. ఈ ఏడాది ఆగస్టు 15న వివాదాస్పద గ్రామాల్లో పర్యటించేందుకు సాలూరు ఎమ్మెల్యే నిర్ణయించారు. ఆ సమయంలో ఉద్రిక్త ఘటనలు జరుగుతాయేమోనన్న భయంతో మన పోలీసు యంత్రాంగం, కలెక్టర్‌తో సహా ఎమ్మెల్యేకు ఫోన్లు చేసి విరమింపజేశారు.


ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగేలా ప్రయత్నిస్తామని వెల్లడించారు. తరువాత ఈ సమస్యను గాలికి వదిలేశారు. తాజాగా మళ్లీ ఒడిశా పోలీసు సిబ్బంది మన ప్రభుత్వ ఉద్యోగులను సరిహద్దు వివాదాస్పద గ్రామాల్లోకి రానీయకుండా అడ్డుకున్నారు. వెలుగు సిబ్బంది, గ్రామ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ, ఏఎన్‌ఎం ఇలా ఎవరినీ వెళ్లనీయడం లేదు. ఒడిశా పోలీసు యంత్రాంగాన్ని వినియోగించి మన జిల్లా వారిని అడ్డుకుంటోంది.  మనవైపు నుంచి దీనిపై శాంతియుత చర్యల కోసం ప్రయత్నించడం లేదు.  


పోలీస్‌ బలగాలతో అడ్డుకుంటున్న వారికి బుద్ధి చెప్పే చర్యలకూ ఉపక్రమించడం లేదు. దీంతో ఒడిశా మరింత దూకుడు పెంచి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జరగనీయడం లేదు. గిరిజనులపై ఒత్తిడి పెంచి ఒడిశావైపు మొగ్గు చూపేలా ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితిలో మన అధికారులను శరణు కోరి వచ్చిన కొఠియా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గిరిజన ప్రజలకు రక్షణ కల్పించాల్సి ఉంది. సన్మానాలు, సత్కారాలు చేసి వారిని మెప్పించి విడిచి పెట్టేస్తే ఒడిశా పోలీసుల నుంచి మరింత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు.

Updated Date - 2021-10-26T04:34:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising