ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు ఎప్పుడో?

ABN, First Publish Date - 2021-05-31T05:21:43+05:30

జిల్లావ్యాప్తంగా రైతులు రబీ సీజన్‌లో పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఉదాహరణకు టెక్కలి మండలంలో తలగాం, బన్నువాడ, వేములాడవిశ్వనాఽథపురం, తేలినీలాపురం, అయోధ్యపురం, పాతనౌపడ, రావివలస, సీతాపురం, తిర్లంగి, పోలవరం, పెద్దసాన, గంగాధరపేట, టెక్కలి తదితర ప్రాంతాల్లో రైతులు రబీ సీజన్‌లో రెండో పంట పండించారు. తలగాంలో జీఈసీఎస్‌ ద్వారా కొనుగోలు కేంద్రం, పాతనౌపడలో సీసీసీ స్టోర్స్‌ ద్వారా, పోలవరంలో వెలుగుశాఖ ద్వారా, టెక్కలిలో డీసీఎంఎస్‌ ద్వారా అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా 80కేజీల ధాన్యం బస్తాకు సుమారు రూ.1,483 చెల్లించాలి. కానీ మిల్లర్లు మాత్రం రూ.1,300 మాత్రమే చెల్లిస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ జాప్యమవుతోంది.

టెక్కలి : వేములాడ విశ్వనాథపురంలో ఽభద్రపరిచిన ధాన్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ముందుకు సాగని ప్రక్రియ

- ఇబ్బందులు పడుతున్న రైతులు

(టెక్కలి)

టెక్కలి మండలం తేలినీలాపురం పంచాయతీ  వేములాడ విశ్వనాథపురానికి చెందిన పైల సోమేశ్వరరావు రబీ సీజన్‌లో రెండు ఎకరాల్లో వరిసాగు చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల జాడ లేకపోవడంతో ధాన్యం విక్రయించేందుకు నానాపాట్లు పడుతున్నారు. మిల్లర్లు 80 కేజీల బస్తా రూ.1,300 చొప్పున అడుగుతున్నారని, కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదని వాపోతున్నారు. 

- టెక్కలి మండలం తలగాం గ్రామానికి చెందిన హనుమంతు వెంకటేశ్వరరావు కూడా రబీ ధాన్యం విక్రయించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు ముందుకు రావడం లేదు. మిల్లర్లపై చర్యలు తీసుకుంటారా? లేదంటే సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ముందు రైతులతో ఆందోళన చేయమంటారా? అంటూ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నారు.

... ఇలా జిల్లావ్యాప్తంగా రైతులు రబీ సీజన్‌లో పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఉదాహరణకు టెక్కలి మండలంలో తలగాం, బన్నువాడ, వేములాడవిశ్వనాఽథపురం, తేలినీలాపురం, అయోధ్యపురం, పాతనౌపడ, రావివలస, సీతాపురం, తిర్లంగి, పోలవరం, పెద్దసాన, గంగాధరపేట, టెక్కలి తదితర ప్రాంతాల్లో రైతులు రబీ సీజన్‌లో రెండో పంట పండించారు. తలగాంలో జీఈసీఎస్‌ ద్వారా కొనుగోలు కేంద్రం, పాతనౌపడలో సీసీసీ స్టోర్స్‌ ద్వారా, పోలవరంలో వెలుగుశాఖ ద్వారా, టెక్కలిలో డీసీఎంఎస్‌ ద్వారా అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా 80కేజీల ధాన్యం బస్తాకు సుమారు రూ.1,483 చెల్లించాలి. కానీ మిల్లర్లు మాత్రం రూ.1,300 మాత్రమే చెల్లిస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ జాప్యమవుతోంది. తక్కువ ధరకు ధాన్యం విక్రయించలేక.. వాటిని భద్రపరచలేక రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యానికి  మిల్లర్లు అనేక సాంకేతిక కారణాలు చూపుతున్నారు. కార్పొరేషన్‌తో ఎంవోయూ కుదుర్చుకోవడం, బ్యాంక్‌ గ్యారంటీల జాప్యం, గ్రేడ్‌లు విభజించి కొనుగోలు చేయడం వంటి సమస్యలతో పాటు వ్యవసాయ శాఖ అందించిన విత్తనాలకు బదులు ఇతర రకాలను రైతులు పండించడం తదితర కారణాలతో కొనుగోలు ప్రక్రియ జాప్యమవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై తహసీల్దార్‌ శిర్ల గణపతిరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా, ఇప్పటికే మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. రబీలో పండిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అప్పటికీ ధాన్యం కొనుగోలుకు ముందుకురానికి మిల్లర్లపై కేసులకు వెనుకాడబోమని తెలిపారు.

Updated Date - 2021-05-31T05:21:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising