ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యుటేషన్‌కు రూ.5 వేలు

ABN, First Publish Date - 2021-06-16T05:14:34+05:30

రెవెన్యూ వ్యవస్థలో సమూల ప్రక్షాళనలు చేసినట్టు ప్రభుత్వం ప్రకటిస్తున్నా... లంచం ఇవ్వనిదే ఏ పనీ జరగడం లేదు. ఓ వ్యక్తికి తండ్రి నుంచి సంక్రమించిన భూమి మ్యుటేషన్‌కు రూ.5 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఎచ్చెర్ల మండ

ఏసీబీకి చిక్కిన వీఆర్వో పొట్నూరు ధర్మపురి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో

ఎచ్చెర్ల, జూన్‌ 15: రెవెన్యూ వ్యవస్థలో సమూల ప్రక్షాళనలు చేసినట్టు ప్రభుత్వం ప్రకటిస్తున్నా... లంచం ఇవ్వనిదే ఏ పనీ జరగడం లేదు. ఓ వ్యక్తికి తండ్రి నుంచి సంక్రమించిన భూమి  మ్యుటేషన్‌కు రూ.5 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఎచ్చెర్ల మండలం భగీరథపురం వీఆర్వో పొట్నూరు ధర్మపురి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. భగీరథపురం పంచాయతీ పరిధిలోని ఓఏ అగ్రహారం గ్రామానికి చెందిన గురువు భాస్కరరావు తన తండ్రి నుంచి సంక్రమించిన 4 ఎకరాలను తన పేరున మార్చి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలని వీఆర్వోను కోరాడు. ఇందుకు వీఆర్వో రూ.10 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. చివరకు రూ.5 వేలకు వారి మధ్య బేరం కుదిరింది. ఈ నేపథ్యంలో పని కోసం నెల రోజుల నుంచి వీఆర్వో చుట్టూ రైతు భాస్కరరావు తిరుగుతున్నా రేపు మాపు అంటూ వాయిదా వేస్తూ వస్తున్నాడు. దీంతో విసిగిపోయిన భాస్కరరావు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు బడివానిపేట గ్రామ సచివాలయం వద్ద వీఆర్వో ధర్మపురికి రూ.5 వేలు అందిస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎస్‌ రమణమూర్తి ఆధ్వర్యంలో సీఐ హరి, భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు.





Updated Date - 2021-06-16T05:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising