ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలందరికీ వ్యాక్సిన్‌

ABN, First Publish Date - 2021-05-10T04:47:00+05:30

కరోనా టీకా పంపిణీలో ప్రభుత్వం చేతులెత్తేయలేదని, ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేం దుకు కట్టుబడి ఉందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. శ్రీకాకుళం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు.

మాట్లాడుతున్న మంత్రి సీదిరి అప్పలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  ఇటువంటి సమయంలో విమర్శలు తగవు 

- మంత్రి సీదిరి అప్పలరాజు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మే 9: కరోనా టీకా పంపిణీలో ప్రభుత్వం చేతులెత్తేయలేదని, ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేం దుకు కట్టుబడి ఉందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. శ్రీకాకుళం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం ఆయన  విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించేందుకు రూ.1600 కోట్లు ఖర్చు అవుతుందని, దీన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ‘వ్యాక్సినేషన్‌పై కొందరు విమర్శలు చేయడం దురదృష్టకరం.  రాష్ట్రానికి 4.50 కోట్ల టీకాలు సరఫరా చేయాలని ఏప్రిల్‌ 24న సంబంధిత పరిశ్రమలకు లేఖ రాశాం. 45 ఏళ్లు పైబడిన వారికి 2.60 కోట్ల డోసులు అవసరం. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సంకల్పంతో, పట్టుదలతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం తగదు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయకుండా వారిలో మనోధైర్యం నింపాలి. ప్రజా సంక్షేమ కోసం ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చుచేస్తుంది. పంటల బీమాకు రూ.2,500 కోట్లు, రైతు భరోసాకు రూ.3,500 కోట్లు అందించాం. మహిళలకు సున్నా వడ్డీ, విద్యార్థులకు వసతి దీవెన, విద్యాదీవెన కార్యక్రమాల కింద వేలాది కోట్లను జమచేశాం’ అని మంత్రి అప్పలరాజు తెలిపారు.  

Updated Date - 2021-05-10T04:47:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising