ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మారని మెనూ!

ABN, First Publish Date - 2021-04-17T05:56:14+05:30

మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా అక్షయపాత్ర ఏజెన్సీ పాఠశా లలకు సరఫరా చేస్తున్న కిచిడీని విద్యార్థులు తినలేకపోతున్నారు.

తినలేక డస్ట్‌బిన్‌లో పారబోస్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కిచిడీని తినలేకపోతున్న విద్యార్థులు 

బయటపారబోస్తున్న వైనం

ఆమదాలవలస : మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా అక్షయపాత్ర ఏజెన్సీ పాఠశా లలకు సరఫరా చేస్తున్న కిచిడీని విద్యార్థులు తినలేకపోతున్నారు. సోమవారం నుంచి శనివారం వరకూ రోజుకో మెనూ అమలవుతుంది. అన్ని రోజులూ భోజనం బాగుంటున్నా గురువారం పూట అందిస్తున్న కిచిడీని  విద్యార్థులు తినలేక బయటపడేస్తున్నారు. దీనిపై గత ఫిబ్రవరిలో  ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో స్పీకర్‌ సతీమణి, తొగరాం సర్పంచ్‌ తమ్మినేని వాణిశ్రీ స్పందించారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఆమె నాసిరకంగా ఉండడంతో  అక్షయపాత్ర అధికారులను మందలించారు. ఈ వ్యవహారం సీఎం దృష్టి వరకూ వెళ్లింది. అయినా కిచిడీ మాత్రం బాగుండడం లేదు.  దీంతో విద్యార్థులు గురువారం నాడు ఇంటి నుంచి కేరియర్లు పట్టుకెళ్తున్నారు. మిగతా రోజుల్లా పప్పన్నం పెడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. లక్ష్మీనగర్‌ పాఠశాలను గురువారం ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించగా విద్యార్థులు కిచిడీని తినలేక డస్టుబిన్‌లో పడేయడం కనిపించింది. ఈ విషయంపై  ఎంఈవో చంద్రశేఖర్‌ వద్ద ప్రస్తావించగా.. మెనూ మార్చమని చెప్పామని, మరోసారి పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.


Updated Date - 2021-04-17T05:56:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising