ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండములగాంలో టౌన్‌షిప్‌?

ABN, First Publish Date - 2021-06-18T05:13:23+05:30

కొవ్వాడ అణు విద్యుత్‌ పరిశ్రమకు సంబంధించి చకచకా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నివాసం ఉండేందుకు టౌన్‌షిప్‌ ఏర్పా టుపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు.

భూములను పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




 అణు పరిశ్రమ అధికారులు, ఉద్యోగుల నివాసాల ఏర్పాటు

 సర్వే ప్రారంభించిన అధికారులు

 అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రైతులు

(రణస్థలం) 

కొవ్వాడ అణు విద్యుత్‌ పరిశ్రమకు సంబంధించి చకచకా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నివాసం ఉండేందుకు టౌన్‌షిప్‌ ఏర్పా టుపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. రణస్థలం మండలం కొండములగాంలో 300 ఎకరాలను గుర్తించారు. తొలుత ఎచ్చెర్ల మండలం ధర్మవరంలో 200 ఎకరాలను గుర్తించినా..ప్రభుత్వ ఆలోచన మారినట్టుగా తెలుస్తోంది. కొండములగాంలోని సర్వే నంబర్‌ 2లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో టౌన్‌షిప్‌ ఏర్పాటు ఆమోదయోగ్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. గురువా రం ఆ భూమిని రెవెన్యూ అధికారులు పరిశీలించారు. రెండు రోజుల పాటు సమగ్ర సర్వే చేసి టౌన్‌షిప్‌ ఏర్పాటుపై స్పష్టతనివ్వనున్నారు. ఒక్కసారిగా అధికారుల పరిశీలనతో స్థానిక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ భూమిలో కొంతమంది రైతులు జీడి, మామిడి సాగుచేసి ఫలసాయం పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ ఉపాధికి గండి  పడుతుందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  


మూడు దశాబ్దాల కిందట తెరపైకి

1991లో కొవ్వాడ అణు పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కానీ స్థానికులు, మత్స్యకారులు అభ్యం తరం వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థి తుల్లో పరిశ్రమ ఏర్పాటుకే మొగ్గుచూపింది. భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించింది. కొవ్వాడతో పాటు రామచంద్రాపు రంలో ఇప్పటికే జిరాయితీ, ప్రభుత్వ భూములను సేకరించిం ది. కానీ పూర్తిస్థాయిలో నిర్వాసిత సమస్యలు కొలిక్కి రాలేదు. ఈ పరిస్థితుల్లో ముందుగా అధికారులు, ఉద్యోగులు ఉండేం దుకు వీలుగా టౌన్‌షిప్‌ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పరిశ్రమకు దగ్గరగా ఉండే కొండములగాం ఆమోదయోగ్యంగా భావిస్తోంది. పైగా ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉండడంతో సేకరణ ప్రక్రియ సులువవుతుందని అంచనా వేస్తున్నారు. కొద్దిరోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. 




Updated Date - 2021-06-18T05:13:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising