ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంటరి మహిళలే లక్ష్యం

ABN, First Publish Date - 2021-08-01T05:58:29+05:30

పలాస పరిసరాల్లో ఒంటరిగా ఉండే మహిళలే లక్ష్యం చేసుకొని దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడు తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్లను కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నా రు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్ల అరెస్టు

  రూ.4.50 లక్షల విలువైన బంగారం స్వాధీనం

పలాస: పలాస పరిసరాల్లో ఒంటరిగా ఉండే మహిళలే లక్ష్యం చేసుకొని దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడు తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్లను  కాశీబుగ్గ పోలీసులు   పట్టుకున్నా రు. వారి నుంచి రూ.4.50 లక్షల విలువైన 102 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు ద్విచక్ర వాహ నాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం   కాశీబుగ్గ పోలీస్‌స్టేష న్‌లో డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి వి వరాలు విలేకరులకు  వెల్లడించా రు. డీఎస్పీ కథనం మేరకు..బరంపురం పట్టణానికి చెందిన సుజీత్‌కుమార్‌పాడి, చింతాడి సింహాచలంపాత్రో గతంలో పలు నేరాలు చేసి ఇరు రాష్ట్రాల పోలీసులకు దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్నారు. వీరు  ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసి చైన్‌స్నాచింగ్‌లు, దొంగతనాలు చేయడంతోపాటు, హత్యలకు పాల్పడుతు న్నారు. గతఏడాది నవంబరులో పలాస మండలం కొబ్బరిచెట్లూరుకు  చెందిన ఆదిలక్ష్మి, మహదేవపురానికి చెందిన తమ్మినాన మోహిని ఒంటరిగా వెళ్తుండగా వీరిద్దరూ చైన్‌స్నాచింగ్‌కు పాల్పడి వారి నుంచి బంగారు ఆభరణాలు దొంగిలిం చారు. అదేవిధంగా జగన్నాఽథపురం, చినంచలల్లో సీహెచ్‌ కుమారి, పైల కల్యాణిలు నిద్రిస్తుండగా వారి మెడలో బంగారం దొంగతనానికి పాల్ప డ్డారు.  చిన్నబడాం  సమీపంలో  జి.రమణమ్మ నివాసంలో రాత్రి ఇంట్లో దూరి బంగారం తస్కరించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో కాశీబుగ్గ క్రైమ్‌ పోలీసులతోపాటు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కోసంగిపురం జాతీయ రహదారి వద్ద సుజీత్‌కుమార్‌పాడి, చింతాడి సింహాచలం పాత్రో ద్విచక్ర వాహ నంపై వెళ్తుండడాన్ని పోలీసులు పాత నేరస్థులుగా భావించి ప్రశ్నించారు. దీంతో వారిద్దరూ దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. దీంతో వారిని అరెస్టు చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన క్రైమ్‌ పోలీసులు సోమేశ్వరరావు, లోకనా ధం, వెంకటేశ్వరరావు, ఢిల్లేశ్వరరావులను డీఎస్పీ అభినందించారు.  సమావేశంలో సీఐ ఎస్‌.శంకరరావు, ఎస్‌ఐ-1 వై.మధుసూదనరావు పాల్గొన్నారు.


 



 



Updated Date - 2021-08-01T05:58:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising