పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేం
ABN, First Publish Date - 2021-10-22T05:23:13+05:30
పోలీ సు అమరవీరుల త్యాగాలు మరువలేనివని పట్టణ సీఐ పి.శ్రీనివాసరావు అన్నారు.
రాజాంరూరల్: పోలీ సు అమరవీరుల త్యాగాలు మరువలేనివని పట్టణ సీఐ పి.శ్రీనివాసరావు అన్నారు. గురువారం సర్కిల్ కార్యాల యంలో అమరవీరుల దినో త్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. వీరిని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు శ్రీనివాసరావు, సూర్యకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.
కంచిలి: సాలినపుట్టుగలో పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. బలిమల ఘటనలో మృతిచెందిన రిజర్వ్ ఎస్‌ఐ సాలిన రామూర్తి విగ్రహానికి సాలినపుట్టుగలో పూలమాలలువేసి నివాళులర్పించారు. సోంపేట సీఐ డీవీవీ సతీష్, ఎస్‌ఐ ఎస్.చిరంజీవి పాల్గొన్నారు. కవిటి: బొరివంకలో ఎస్‌ఐ అప్పారావు ఆధ్వర్యంలో పోలీసులు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు.
Updated Date - 2021-10-22T05:23:13+05:30 IST