ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో నక్సలైట్ల ప్రాబల్యం తగ్గింది

ABN, First Publish Date - 2021-10-18T05:02:57+05:30

జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్‌ వల్ల నక్సలైట్ల ప్రాబల్యం తగ్గుముఖం పట్టిందని ఎస్పీ అమిత్‌బర్దర్‌ తెలిపారు.

గిరిజన యువతకు టీషర్టులు పంపిణీ చేస్తున్న ఎస్పీ అమిత్‌బర్దర్‌:
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఎస్పీ అమిత్‌బర్దర్‌ 


సీతంపేట, అక్టోబరు 17:  జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్‌  వల్ల నక్సలైట్ల ప్రాబల్యం తగ్గుముఖం పట్టిందని  ఎస్పీ అమిత్‌బర్దర్‌ తెలిపారు. ఆదివారం సీతంపేటలోని  గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల క్రీడా మైదానంలో పోలీసుల  ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ పోలీస్‌ వాలీబాల్‌ పోటీలు ప్రారంభించారు. ఈసందర్భంగా  అమిత్‌బర్దర్‌  మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో గిరిజ న యువతతో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గిరిజన యువత నక్సలైట్ల వైపు మొగ్గు చూపకుండా ఉండేందుకు  కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ ఇస్తూ  ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు.సారా నిర్మూలనకు తమ శాఖ ప్రత్యేక దృష్టిసారించిందని చెప్పా రు.  దీనిలో భాగంగా సీతంపేట మండలం మండ గ్రామాన్ని దత్తత తీసుకున్నామని తెలిపారు. ఈపోటీల్లో కొత్తూరు సర్కిల్‌ పరిధిలో గల బత్తిలి, దోనుబాయి, సీతంపేట పోలీస్‌ స్టేషన్ల పరిధిలోగల   22 వాలీబాల్‌ జట్లు పాల్గొన్నాయి.  విజేతలుగా నిలిచిన భామిని మండలంలోని నల్లరాయిగూడకు చెందిన  జట్లకు  ప్రఽథమ, ద్వితీయ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాలకొండ డీఎస్పీ శ్రావణి, కొత్తూరు సీఐ సూర్యచంద్రమౌళి, బత్తిలి, సీతంపేట, కొత్తూరు ఎస్‌ఐలు చంద్రకళ, ప్రభావతి, అనీల్‌  పాల్గొన్నారు. 


  


Updated Date - 2021-10-18T05:02:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising