ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహనీయుల చరిత్ర స్ఫూర్తిదాయకం

ABN, First Publish Date - 2021-11-17T05:27:56+05:30

జిల్లాలో గ్రంథాలయ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం గ్రంథాలయ ఉద్యమకారులైన ఆచార్య రంగనాథన్‌, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి గ్రంథాలయ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళులర్పించారు.

పాలకొండ: గ్రంథాలయ ఉద్యమకారుల చిత్రపటాలకు పూలమాల వేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రంథాలయ ఉద్యమకారులకు నివాళి
జిల్లాలో గ్రంథాలయ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం గ్రంథాలయ ఉద్యమకారులైన ఆచార్య రంగనాథన్‌, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి గ్రంథాలయ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళులర్పించారు. విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. శ్రీకాకుళం నగరంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు పాల్గొని మాట్లాడారు.  మహనీయుల చరిత్ర స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఇచ్ఛాపురం శాఖా గ్రంథాలయంలో లైబ్రేరియన్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రంథాలయ ఉద్యమకారులకు నివాళులు అర్పించారు.  విద్యార్థులకు స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రలపై వ్యక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలుగా జూనియర్స్‌ విభాగంలో విషామహాపతిరావు, స్వాతీ, దేవి, సీనియర్స్‌ విభాగంలో సంజన, కృష్ణవేణి, మౌనిక గెలుపొందారు. ఎచ్చెర్ల శాఖా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో  జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కె.కుమార్‌రాజా పాల్గొని మాట్లాడారు. పుస్తకాల ఆవశ్యకతను ప్రతిఒక్కరూ గుర్తించాలని తెలిపారు.

- ఆంధ్రజ్యోతి బృందం

Updated Date - 2021-11-17T05:27:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising