ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదరహిత ప్రయాణమే లక్ష్యం

ABN, First Publish Date - 2021-01-25T05:20:00+05:30

అందరి లక్ష్యం... ప్రమాదరహిత ప్రయాణమే అని పోలీసులు నినాదాలు చేశారు. రోడ్డుభద్రతా మాసోత్సవాల్లో భాగంగా శ్రీకాకు ళం నగరంలో ఆదివారం ట్రాఫిక్‌ డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసులు హెల్మెట్‌ ధరించి బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

హెల్మెట్లు ధరించి బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 హెల్మెట్‌ లేకుండా బైక్‌ తీయొద్దు

 పోలీసుల అవగాహన ర్యాలీ

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: అందరి లక్ష్యం... ప్రమాదరహిత ప్రయాణమే అని పోలీసులు నినాదాలు చేశారు. రోడ్డుభద్రతా మాసోత్సవాల్లో భాగంగా శ్రీకాకు ళం నగరంలో ఆదివారం ట్రాఫిక్‌ డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసులు హెల్మెట్‌ ధరించి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఏడురోడ్ల జంక్షన్‌ నుంచి నగర ప్రధాన జంక్షన్లన్నింటినీ కలుపుతూ ర్యాలీ  సాగింది.  అనంతరం డీఎస్పీ ప్రసాదరావు మాట్లాడుతూ, హెల్మెట్‌ ధరించకుండా బైక్‌, సీటు బెల్టు పెట్టుకోకుండా కారుని నడపవద్దన్నారు.  పదిమంది మైనర్లు బైక్‌లు నడుపుతూ పట్టుబడ్డారని,  వాళ్ల తల్లితండ్రులను పిలిచి వారి సమక్షంలోనే మైనర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చామని వివరించారు.  కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఎస్‌ఐ లక్ష్మణరావు, ట్రాఫిక్‌, సివిల్‌ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ రణస్థలం: ఆటో డ్రైవర్లు విధిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని జేఆర్‌పురం ఎస్‌ఐ కంది వాసునారాయణ తెలిపారు. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్‌ నిబంధనలపై ఆదివారం అవగాహన కల్పించారు. డ్రైవర్‌ సీటు పక్కన ఎవరినీ కూర్చొపెట్టవద్దన్నారు.  విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిస్తే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.  తప్పసరిగా డ్రైవింగ్‌ లైసన్స్‌ ఉండాలని సూచించారు. 


Updated Date - 2021-01-25T05:20:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising