ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జెండా పట్టిన వారికే ‘చేయూత?’

ABN, First Publish Date - 2021-06-16T04:59:09+05:30

రాష్ట్ర ప్రభుత్వం 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ఇటీవల అమలు చేసిన ‘చేయూత’ పథకాన్ని వైసీపీ జెండా పట్టిన వారికే అందిస్తారా అంటూ వంగరకు చెందిన పలువురు మహిళ లు ప్రశ్నించారు. మంగళవారం గ్రామానికి చెందిన పి.కృష్ణవేణి, లక్ష్మి, పద్మావతి, హేమలత తదితరులు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు.

ఎంపీడీవో త్రినాథను ప్రశ్నిస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పథకం జాబితాలో పేర్లు తొలగించడంపై మహిళల ఆగ్రహం 

వంగర, జూన్‌ 15: రాష్ట్ర ప్రభుత్వం 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ఇటీవల అమలు చేసిన ‘చేయూత’ పథకాన్ని వైసీపీ జెండా పట్టిన వారికే అందిస్తారా అంటూ వంగరకు చెందిన పలువురు మహిళ లు ప్రశ్నించారు. మంగళవారం  గ్రామానికి చెందిన పి.కృష్ణవేణి, లక్ష్మి, పద్మావతి, హేమలత తదితరులు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఇటీవల సర్పంచ్‌ ఎన్నికల్లో ఆ పార్టీ జెండా పట్టుకోలేదన్న నెపంతో అర్హులమైనా జాబితా నుంచి పేర్లు తొలగించడం దారుణమన్నారు.  గ్రామంలో 17 మంది పేర్లు తొలగించారని, కారణం చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. దీంత ఎంపీడీవో త్రినాథ బయటకు వచ్చి వారితో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. సమస్య తన దృష్టికి రాలేదని, సచివాలయ సిబ్బందితో చర్చించి న్యాయం చేస్తానని ఎంపీడీవో చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. తమకు న్యాయం చేయాలని లేకుంటే రెండు రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనం తరం వినతిపత్రం అందించారు. అలాగే రుషింగిలో పార్టీ పేరుతో ఏడు గురి పేర్లు తొలగించారని మాజీ ఎంపీపీ  ఎలకల అమ్మడమ్మ ఆరో పించారు. అన్ని అర్హతలున్న తమ సానుభూతిపరులకు అన్యాయం జరిగితే కోర్టుకు వెళతామని ఆమె హెచ్చరించారు. మహిళల ఆందోళనకు మద్దతుగా  వామ పక్ష నేతలు గణపతి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2021-06-16T04:59:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising