ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ వైఫల్యంతోనే ధరల భారం!

ABN, First Publish Date - 2021-08-04T05:27:27+05:30

నిత్యావసరాల ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ విమర్శించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మంగళవారం నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.

తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేస్తున్న కూన రవికుమార్‌, బగ్గు రమణమూర్తి, టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌

- నరసన్నపేటలో భారీ నిరసన ర్యాలీ

నరసన్నపేట, ఆగస్టు 3: నిత్యావసరాల ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ విమర్శించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మంగళవారం నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ముందుగా జట్టు కలాసీ యూనియన్‌ భవనం వద్ద ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ చేశారు. ధరలను నియంత్రణకు చర్యలు చేపట్టాలని తహసీల్దారు కార్యాలయంలో డీటీ హేమసుందర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రవికుమార్‌ మాట్లాడుతూ ఇసుక ధరలు సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్నాయన్నారు. ఇసుక సొమ్ము సీఎం జగన్‌, మంత్రి కృష్ణదాస్‌ జేబుల్లోకి వెళ్తున్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఇంటి నిర్మాణానికి రూ.2 లక్షలు ఇస్తే... వైసీపీ ప్రభుత్వం రూ.1.80 లక్షలకు కుదించిందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ అని నాడు చెప్పిన సీఎం జగన్‌.. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? అని ప్రశ్నించారు. రోడ్డు సెస్‌ ద్వారా రూ.1,200 కోట్లు వసూలు చేసిన ప్రభుత్వం రహదారుల దయనీయ స్థితిని మాత్రం పట్టించుకోలేదన్నారు. ఆ నిధులు ఏంచేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజాధనం వృథా చేస్తున్న ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, కలమట వెంటకరమణమూర్తి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు మెట్ట సుజాత, పీఎంజే బాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-04T05:27:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising