ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏమైందో?

ABN, First Publish Date - 2021-08-02T04:12:30+05:30

ఏమైందో?

ఇసుక తెన్నుల్లో పాతిన మృతదేహాన్ని బయటకు తీస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వంశధార నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం

- దహనం చేసి.. ఇసుకలో పూడ్చిన ఆనవాళ్లు లభ్యం

- అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు

నరసన్నపేట, ఆగస్టు 1 : వంశధార నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడింది. మృతదేహం దహనమై.. ఇసుకలో పూడ్చిన ఆనవాళ్లు ఉండడంతో ఆమెను ఎవరో హత్య చేసి ఉంటారని స్థానికులు భావిస్తు న్నారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వంశధార నదిలో జలుమూరు మండలం అంధవరం గ్రామానికి వెళ్లే మార్గంలో ఆదివారం దుర్వాసన వస్తుండడంతో స్థానికులు అనుమానంతో వెతకగా అక్కడ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమందించడంతో ఎస్‌ఐ సత్య నారాయణ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు ఇసు కలో పూడికపోయిన ఓ మహిళ మృతదేహాన్ని బయ టకు తీశారు. గ్రామీణ మహిళ వస్త్రాలంకరణలో ముక్కుకు కమ్ములు, కాళ్లకు మట్టెలు ఉన్నాయి. నాలు గు రోజుల కిందట ఆమె చనిపోయినట్టు అనుమా నిస్తున్నారు. శరీరం ఉబ్బిపోయి గుర్తుపట్టలేని విధంగా మారి పోయింది. నది పరివాహక మండలాలకు చెందిన మహిళ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. నదిలో వచ్చి ఇసుక తిన్నెల్లో మృతదేహం పూడికపోయిందా? లేక వేరే ప్రాంతంలో హత్యచేసి ఇక్కడ పాతిపెట్టారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే అక్కడ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ఆనవాళ్లు ఉండడంతో ప్రాథమికంగా హత్యగా నిర్థారణకు వచ్చారు. మృతురాలి వయసు 55 సంవత్సరాలు ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్‌సీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఈమె ఏ ప్రాంతానికి చెందినదో.. ఈ ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని వెల్లడించారు. 



 

Updated Date - 2021-08-02T04:12:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising