ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలాసలో టెన్షన్‌..టెన్షన్‌

ABN, First Publish Date - 2021-11-28T06:00:50+05:30

ప్లాట్‌ఫారంపై అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 108 వాహనం అక్కడికి వెళుతోంది. అంతలోనే విశాఖ నుంచి భువనేశ్వర్‌ వెళుతున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ స్టేషన్‌కు చేరుకుంటోంది. రైలు వచ్చిన విషయాన్ని 108 వాహన సిబ్బంది గుర్తించలేదు. తీరా గుర్తించేసరికే రైలు దగ్గరికి వచ్చేసింది. అప్పటికే ఆలస్యమైపోయింది. 108 సిబ్బంది ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. మరోవైపు ప్లాట్‌ఫారంపై నుంచి ఈ దృశ్యాన్ని చూస్తున్న రైల్వే సిబ్బంది...ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన. ఘోర ప్రమాద ఘటనను చూడాల్సి వస్తోందనే భయంతో కొందరు కళ్లు మూసుకున్నారు. రైలు కోసం వేచి ఉన్న వారు భయంతో పరుగులు తీశారు. అందరూ అనుకున్నట్టే జరిగింది. 108 వాహనాన్ని రైలు ఢీకొట్టింది. సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకుపోయింది. ఆ వాహనం నుజ్జునుజ్జయింది. ఈ శబ్దంతో రైలులోని ప్రయాణికుల్లోనూ ఆందోళన. 108 వాహనంలో సిబ్బంది ఎందరు ఉన్నారో...వారికి ఏమయ్యిందోనని ఉత్కంఠ. అదృష్టవశాత్తూ రైలు ఢీకొన్న క్షణాల్లోనే 108 సిబ్బంది వాహనం నుంచి బయటకు దూకేశారు. దీంతో పెద్ద వారి ప్రాణాలకు ముప్పు తప్పింది.

108 వాహనాన్ని ఢీకొట్టిన ఇంటర్‌సిటీ రైలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



108 వాహనాన్ని ఢీకొట్టిన ఇంటర్‌సిటీ రైలు

500 మీటర్ల మేర ఈడ్చుకుపోయిన వైనం

ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న జనం

పలాస రైల్వేస్టేషన్‌ వద్ద ఘటన

అందరిలోనూ ఆందోళన

పలాస, నవంబరు 27:

సమయం.. శనివారం రాత్రి 7.30 గంటలు.

పలాస రైల్వే స్టేషన్‌.

ప్లాట్‌ఫారంపై అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 108 వాహనం అక్కడికి వెళుతోంది.

అంతలోనే విశాఖ నుంచి భువనేశ్వర్‌ వెళుతున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ స్టేషన్‌కు చేరుకుంటోంది. రైలు వచ్చిన విషయాన్ని 108 వాహన సిబ్బంది గుర్తించలేదు. తీరా గుర్తించేసరికే రైలు దగ్గరికి వచ్చేసింది. అప్పటికే ఆలస్యమైపోయింది. 108 సిబ్బంది ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. మరోవైపు ప్లాట్‌ఫారంపై నుంచి ఈ దృశ్యాన్ని చూస్తున్న రైల్వే సిబ్బంది...ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన. ఘోర ప్రమాద ఘటనను చూడాల్సి వస్తోందనే భయంతో కొందరు కళ్లు మూసుకున్నారు. రైలు కోసం వేచి ఉన్న వారు భయంతో పరుగులు తీశారు. అందరూ అనుకున్నట్టే జరిగింది. 108 వాహనాన్ని రైలు ఢీకొట్టింది. సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకుపోయింది. ఆ వాహనం నుజ్జునుజ్జయింది. ఈ శబ్దంతో రైలులోని ప్రయాణికుల్లోనూ ఆందోళన. 108 వాహనంలో సిబ్బంది ఎందరు ఉన్నారో...వారికి ఏమయ్యిందోనని ఉత్కంఠ. అదృష్టవశాత్తూ రైలు ఢీకొన్న క్షణాల్లోనే 108 సిబ్బంది వాహనం నుంచి బయటకు దూకేశారు. దీంతో పెద్ద వారి ప్రాణాలకు ముప్పు తప్పింది. ఇటు రైలులోని ప్రయాణికులూ క్షేమంగా బయట పడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే...  కోల్‌కత్తాకు చెందిన ప్రయాణికుడు అనారోగ్యానికి గురయ్యాడని పలాస రైల్వేస్టేషన్‌ నుంచి 108 సిబ్బందికి సమాచారం వచ్చింది. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న సిబ్బంది... వాహనంతో సహా నడక దారి (అత్యవసర సమయాల్లో అనుమతించే మార్గం) గుండా ప్లాట్‌ఫారం-3కి చేరుకున్నారు. అదే సమయంలో స్టేషన్‌కు వచ్చిన ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ 108 వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో సిబ్బంది ప్రాణభయంతో వాహనం నుంచి దూకేశారు. ప్రాణాలను దక్కించుకున్నారు. సుమారు 500 మీటర్ల మేర రైలు ఈడ్చుకుపోవడంతో 108 వాహనం నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాద దృశ్యాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులకు కొన్ని క్షణాల పాటు నోట మాట రాలేదు. అక్కడ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్టేషన్‌ మేనేజర్‌ కె.డి.పట్నాయక్‌, ఆర్పీఎఫ్‌ ఓసీ కేకే శామ్యూల్‌, కాశీబుగ్గ సీఐ ఎస్‌.శంకరరావు తమ సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకొని సంఘటనకు గల కారణాలు అడి గి తెలుసుకున్నారు. దీంతో రెండున్నర గంటల పాటు ఇంటర్‌ సిటీ రైలు స్టేషన్‌లో నిలిచిపోయింది. తాము ప్రాణాలతో బయట పడతామని అనుకోలేదని 108 సిబ్బంది ఆనంద్‌, సత్యం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. రైలు రాకను గమనించలేదన్నారు. ఎప్పటిలాగానే నడక మార్గంలో వె ళ్లి... ప్రమాదానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. 




Updated Date - 2021-11-28T06:00:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising