ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నిబంధనలు ఉల్లంఘించారని...మంత్రి, చైర్మన్‌పై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-06-24T05:08:10+05:30

కరోనా నిబంధనలను మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, మునిసిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు ఉల్లంఘించారని పేర్కొం టూ టీడీపీ నాయకులు పోలీసులకు బుధవారం ఫిర్యాదుచేశారు. కరోనా నిబంధనల ప్రకారం సభలు, సమావేశాలు ఏర్పాటు చేయకూడదని ప్రభుత్వం ఆంక్ష లు విధించినా మంత్రి వాటిని ఉల్లంఘించారని ఆరోపిం చారు. మంగళ వారం సాయంత్రం కాశీబుగ్గ సంతమైదానంలో వైఎస్‌ఆర్‌ చేయూత లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం పేరుతో సభ నిర్వ హించి నిబంధనలకు తిలోదకాలిచ్చారని పేర్కొంటూ టీడీపీ నాయకులు కాశీబుగ్గ సీఐ శంకరరావుకు ఫిర్యాదు చేశారు.

ుంత్రి అప్పలరాజు, చైర్మన్‌ గిరిబాబుపై సీఐ శంకరరావుకు ఫిర్యాదుచేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాస, జూన్‌ 23: కరోనా నిబంధనలను మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, మునిసిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు ఉల్లంఘించారని పేర్కొం టూ టీడీపీ నాయకులు పోలీసులకు బుధవారం ఫిర్యాదుచేశారు. కరోనా నిబంధనల ప్రకారం సభలు, సమావేశాలు ఏర్పాటు చేయకూడదని ప్రభుత్వం ఆంక్ష లు విధించినా మంత్రి వాటిని ఉల్లంఘించారని ఆరోపిం చారు. మంగళ వారం సాయంత్రం కాశీబుగ్గ సంతమైదానంలో వైఎస్‌ఆర్‌ చేయూత లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం పేరుతో సభ నిర్వ హించి నిబంధనలకు తిలోదకాలిచ్చారని పేర్కొంటూ టీడీపీ నాయకులు  కాశీబుగ్గ సీఐ శంకరరావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు, జిల్లా ఆర్గ నైజింగ్‌ సెక్రటరీ గాలి కృష్ణారావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు లొడగల కామేశ్వరరావు యాదవ్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ వజ్జ బాబూరావు మాట్లాడుతూ.. వివాహ వేడుకలకు అనుమతులివ్వని ప్రభుత్వం సభలు, సమావేశాలకు ఇవ్వవచ్చా? అని ప్రశ్నించారు. తక్షణమే అధికారులు స్పందించి మంత్రి అప్పలరాజు, చైర్మన్‌ బళ్ల గిరి బాబులపై చర్యల తీసుకోవాలని కోరారు. అలాగే  టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష తరపున కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి, చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని శిరీష కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గురిటి సూర్యనారాయణ, బడ్డ నాగరాజు, సుదర్శన రావు, సింహాచలం, దువ్వాడ శ్రీహర్ష, గంగారామ్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-06-24T05:08:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising