ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీ పారాపురంలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-12-02T05:28:03+05:30

డంపింగ్‌ యార్డు ఏర్పాటు విషయమై టీడీ పారాపురంలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. పాలకొండ నగర పంచాయతీలో వ్యర్థాలను తరలించేందుకు టీడీ పారాపురం సమీపంలో డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై గ్రామస్థులు ఎప్పటికప్పుడు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా.. అధికారులు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా బుధవారం నగర పంచాయతీ కమిషనర్‌ రామారావు ఆధ్వర్యంలో అధికారులు, పారిశుఽధ్య కార్మికులు చెత్తను పారాపురం సమీపంలో డంపింగ్‌ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, ఆయన భార్య యోగితతో పాటు వందలాది మంది గ్రామస్థులు చేరుకొని డంపింగ్‌ను అడ్డుకున్నారు.

కమిషనర్‌తో వాగ్వావాదం చేస్తున్న టీడీ పారాపురం గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డంపింగ్‌ యార్డు ఏర్పాటుపై గ్రామస్థుల వ్యతిరేకత

- నగర పంచాయతీ అధికారులతో వాగ్వాదం

- 120 మంది అరెస్టు..విడుదల

(పాలకొండ, డిసెంబరు 1)

డంపింగ్‌ యార్డు ఏర్పాటు విషయమై టీడీ పారాపురంలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. పాలకొండ నగర పంచాయతీలో వ్యర్థాలను తరలించేందుకు టీడీ పారాపురం సమీపంలో డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై గ్రామస్థులు ఎప్పటికప్పుడు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా.. అధికారులు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా బుధవారం నగర పంచాయతీ కమిషనర్‌ రామారావు ఆధ్వర్యంలో అధికారులు, పారిశుఽధ్య కార్మికులు చెత్తను పారాపురం సమీపంలో డంపింగ్‌ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, ఆయన భార్య యోగితతో పాటు వందలాది మంది గ్రామస్థులు చేరుకొని డంపింగ్‌ను అడ్డుకున్నారు. తమ గ్రామానికి కేవలం 50 మీటర్ల దూరంలోనే చెత్తను వేయడం ద్వారా తాము అనారోగ్యం బారిన పడే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జేసీ సుమిత్‌కుమార్‌, ఆర్డీవో కుమార్‌తో పాటు పోలీసులకు ఈ విషయంపై విన్నవించామని, అయినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే డంపింగ్‌ యార్డు ఏర్పాటు ప్రక్రియను విరమించుకోవాలని కోరారు. ఈ క్రమంలో నగర పంచాయతీ అధికారులు, సిబ్బంది, గ్రామస్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం తమకు కేటాయించిన స్థలంలోనే చెత్తను డంపింగ్‌ చేస్తామని కమిషనర్‌ బదులిచ్చారు. దీనిపై ప్రజలు అపోహ పడవద్దని, చెత్త ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేసేందుకు ఉపక్రమిస్తున్నామని తెలిపారు. కమిషనర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ  శ్రావణి ఆధ్వర్యంలో సీఐ శంకరరావు, పాలకొండ, వీరఘట్టం ఎస్‌ఐలు ప్రసాద్‌, భాస్కరరావులు సిబ్బందితో టీడీపారాపురం  చేరుకున్నారు. ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నం చేశారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ, ఈ ప్రాంతంలో డంపింగ్‌ ఏర్పాటుకు అంగీకరించబోమని గ్రామస్థులు నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు 120 మందిని అదుపులోకి తీసుకుని పాలకొండ, వీరఘట్టం పోలీస్‌స్టేషన్లకు తరలించారు. పాలకొండ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ, పార్టీ  మండలాధ్యక్షుడు గండి రామినాయుడులు పోలీస్‌స్టేషన్ల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. న్యాయంగా పోరాడుతున్న వారిని విడుదల చేయాలని ఎస్‌ఐ ప్రసాద్‌ను కోరారు. మధ్యాహ్నం సొంత పూచీకత్తుపై  పోలీసులు వారిని విడుదల చేశారు. ఆందోళనకారులకు సీపీఎం నాయకులు తిరుపతిరావు, దావాల రమణారావు సంఘీభావం తెలిపారు.    

Updated Date - 2021-12-02T05:28:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising