ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెచ్చులూడి... ప్రమాదం తప్పి

ABN, First Publish Date - 2021-09-29T05:40:00+05:30

పెచ్చులూడి... ప్రమాదం తప్పి

పాఠశాల స్తంభం దుస్థితి, పెచ్చులూడిన పైకప్పు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సేపానపేట పాఠశాలకు సెలవు ప్రకటించిన అధికారులు

ఆమదాలవలస రూరల్‌ : సేపానపేట పాఠశాల భవనం పైకుప్పు నుంచి పెచ్చులూడడంతో ప్రమాదం తప్పింది. దీంతో అధికారులు బుధవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. మూడు దశాబ్దాల కిందట నిర్మించిన ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది.  గులాబ్‌ తుఫాన్‌ వల్ల కురిసిన వర్షాలకు భవనం తడిసి ముద్దయింది.దీనికితోడు పైకప్పు ఇనుము తుప్పుపట్టడంతో పెచ్చులూడి కిందిపడింది. మంగళవారం పాఠశాల తెరిచే సమయానికి పైకప్పు ఊడిపడి ఉండటాన్ని గమనించిన ఉపాధ్యాయులు విద్యార్థులను గదిలోకి వెల్లనీయకుండా చర్యలు తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్‌ సేపాన సత్తిరాజు  విద్యాశాఖ అదికారులకు సమాచారం అందించారు. రాత్రిసమయంలో పైకప్పు ఊడిపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ 22 మంది చదువుతున్నారు. కాగా పాఠశాల పైకప్పు పెచ్చులూడినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఆర్పీ వెంకటరమణ ఆంధ్రజ్యోతికి తెలిపారు. పాశాలకు మంగళ బుధవారం సెలవు ప్రకటించామని పాఠశాలను వేరేచోటుకు తరలించి తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.

Updated Date - 2021-09-29T05:40:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising