ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోండి

ABN, First Publish Date - 2021-06-19T05:14:57+05:30

కరోనా బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. అధిష్టానం పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో ఆర్డీవో కిషోర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ... కరోనా కారణంగా పేద, దిగువ తరగతి కుటుంబాలకు ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

ఆర్డీవో కిషోర్‌కు వినతిపత్రం అందిస్తున్న కూన రవికుమార్‌, టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలి

 శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ 

శ్రీకాకుళం, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): కరోనా బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. అధిష్టానం పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో ఆర్డీవో కిషోర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ... కరోనా కారణంగా పేద, దిగువ తరగతి కుటుంబాలకు ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బియ్యం కార్డు(తెల్లరేషన్‌) ఉన్న కుటుంబాల్లో ఎవరైనా కరోనాతో మృతి చెందితే రూ.10లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆక్సిజన్‌ కొరతతో జరిగిన మరణాలన్నిటికీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందజేయాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మృతుల దహన సంస్కారాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేలు అందరికీ అందడం లేదన్నారు. కరోనా దెబ్బకు వ్యవసాయ రంగం కుదేలైందని  తెలిపారు. రైతులను ఆదుకొనేందుకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతులకు బకాయిలను వెంటనే అందజేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, చిట్టి మోహన్‌, బలగ నాగేశ్వరరావు, పీఎంజే బాబు, కిల్లి వేణుగోపాలస్వామి, ఎం.త్రినాథరావు, రమేష్‌, విజయరామ్‌, తిరుమలరావు, సుధాకర్‌, చౌదరి బాబ్జి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T05:14:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising