ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాణ్యమైన పౌష్టికాహారం సరఫరా

ABN, First Publish Date - 2021-10-22T05:29:41+05:30

అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తున్నట్లు శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. జడ్పీ సమావేశ మందిరంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, సీదిరి అప్పలరాజులతో కలసి శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి వనిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డలు బాగుంటారు

 శిశుసంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, అక్టోబరు 21: అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తున్నట్లు శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. జడ్పీ సమావేశ మందిరంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, సీదిరి అప్పలరాజులతో కలసి శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలు, తదితర వాటికి సరఫరా చేసే పౌష్టికాహారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. టెండర్లలో చూపించిన సరుకుల్లో తేడా లేకుండా చూడాలన్నారు. మహిళలు, చిన్నారుల పౌష్టికాహారం కోసం  ప్రభుత్వం ఏడాదికి రూ. 1800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు రూ.118 కోట్లు కేటాయించినట్లు వివరించారు. గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టే బిడ్డలు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారని, దీనిపై మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు.  మహిళలపై అఘాయిత్యాలు జరిగితే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని అఽధికారులను ఆదేశించారు.  స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. జిల్లాకు పౌష్టికాహారం నిధులను పెంచాలని కోరారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు చిన్మయిదేవి, ఐసీడీఎస్‌ పీడీ జయదేవి, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. 




Updated Date - 2021-10-22T05:29:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising