ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరుబయటే విద్యార్థుల సైకిళ్లు

ABN, First Publish Date - 2021-04-10T05:43:35+05:30

మండలంలోని పలు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సైకిళ్లను భద్రపరచుకోవడానికి షెడ్లు కరువయ్యాయి. దీంతో సైకిళ్లను ఆరుబయటే ఉంచాల్సి వస్తోంది.

గార హైస్కూల్‌లో ఎండలో ఉన్న విద్యార్థుల సైకిళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాఠశాలల్లో కానరాని షెడ్లు

గార, ఏప్రిల్‌ 9: మండలంలోని పలు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సైకిళ్లను భద్రపరచుకోవడానికి షెడ్లు కరువయ్యాయి. దీంతో సైకిళ్లను ఆరుబయటే ఉంచాల్సి వస్తోంది. ఫలితంగా ఎండకు ఎండి, వానకు తడిసి మరమ్మత్తులకు గురవుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. గార, అంపోలు, శ్రీకూర్మం, కొర్ని, డి.మత్స్యలేశం, తదితర ఉన్నత పాఠశాలల్లో చుట్టపక్కల గ్రామాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా గ్రామాల నుంచి ఈ పాఠశాలలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేదు. దీంతో విద్యార్థులు సైకిళ్లపై బడులకు వెళ్లి వస్తున్నారు. అయితే, సైకిళ్లు పెట్టుకో వడానికి పాఠశాలల ఆవరణలో షెడ్లు లేకపోవడంతో ఆరుబయటే పార్కింగ్‌ చేస్తున్నారు. దీనివల్ల ఎండకు టైర్లు పేలిపోతున్నాయని, ట్యూబ్‌ల్లో గాలి తగ్గి పోతుందని విద్యార్థులు వాపోతున్నారు. వర్షాకాలంలో చైన్‌, ప్రీవుల్స్‌ తుప్పుపట్టి మరమ్మతులకు గురవుతున్నాయన్నారు. పాఠశాలలు విడిచిపెట్టిన తరువాత ఇళ్లకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వం నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ, తమ సైకిళ్లు భద్రపరుచుకోవడానికి షెడ్లు మాత్రం నిర్మించడం లేదన్నారు. ఇప్పటికైనా సైకిళ్ల షెడ్లను అందుబాటులోకి తేవాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. 


Updated Date - 2021-04-10T05:43:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising