ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలక్షేపానికి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2021-05-12T05:16:05+05:30

ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే ఉండాలని, కాలక్షేపానికి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి స్పష్టం చేశారు. మంగళవారం నాలుగురోడ్ల కూడలిలో సుమారు రెండు గంటల పాటు కర్ఫ్యూ పరిస్థితిని పరిశీలించారు.

వాహనదారులను హెచ్చరిస్తున్న పాలకొండ డీఎస్పీ శ్రావణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  పాలకొండ డీఎస్పీ శ్రావణి

రాజాం రూరల్‌, మే 11: ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే ఉండాలని, కాలక్షేపానికి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి స్పష్టం చేశారు. మంగళవారం  నాలుగురోడ్ల కూడలిలో సుమారు రెండు గంటల పాటు కర్ఫ్యూ పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సరైన కారణం లేకుండా తిరిగిన వారికి రూ. 2వేలు జరిమానా విధిస్తామని, వారం రోజుల పాటు వాహనాన్ని సీజ్‌ చేస్తామన్నారు. వాహనాలను ఆపి రాక పోకలకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. తగిన ఆధారాలు లేని వాహ నదారులకు జరిమానా విధించారు. కార్యక్రమంలో రాజాం టౌన్‌ సీఐ  శ్రీనివాసరావు, ఎస్‌ఐ సూర్యకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.

 

అప్రమత్తంగా ఉండండి: కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి 

పలాస: కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి కోరారు. మంగళవారం కాశీబుగ్గ మూడురోడ్ల జంక్షన్‌, పలాస ఇందిరాచౌక్‌ వద్ద ప్లకార్డులతో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనవసరంగా రోడ్డుపైకి రావద్దని హితవు పలికారు. కార్యక్రమంలో సీఐ శంకరరావు, ఎస్‌ఐ మధుసూదన రావు, సిబ్బంది పాల్గొన్నారు.


రోడ్లపై తిరిగితే  కేసులు..

నరసన్నపేట: అనవసరంగా రోడ్లపై తిరిగే ఆకతాయిలపై చర్యలు తీసుకుంటామని  సీఐ తిరుపతి అన్నారు. మంగళవారం పట్టణం లో వివి ధ బ్యాంకులు, షాపింగ్‌ మాల్స్‌లో కరోనాపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం కేసులు పెరుగుతున్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. కర్ఫ్యూ సమయంలో బయట తాళాలు వేసి విక్రయాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు సత్యనారా యణ, ప్రసాద్‌, ప్రమీల తదితరులు పాల్గొ న్నారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు మండలంలో 50 కేసులు నమో దైనట్లు డీటీ హేమసుందర్‌ చెప్పారు.  


డబుల్‌ మాస్కులు ధరించండి

టెక్కలి రూరల్‌: కరోనా ప్రభావం అధికంగా ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టెక్కలి సీఐ ఆర్‌.నీలయ్య కోరారు. మంగళవారం పట్టణంలోని ఇందిరా గాంధీ కూడలి నుంచి అంబేద్కర్‌ కూడలి వరకు సిబ్బందితో నడుచుకుంటూ ప్లకార్డులతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతీ ఒక్క రూ బాధ్యత వహించాలన్నారు. అత్యవసర సమయాల్లో బయటకు వచ్చిన ప్పుడు డబుల్‌ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు ఎన్‌.కామేశ్వరరావు, గోపాలరావు, ఏఎస్‌ఐ రామ చంద్రరావు, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

 


 

Updated Date - 2021-05-12T05:16:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising