ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్వేతగిరి యాత్రకు వేళాయె!

ABN, First Publish Date - 2021-02-23T05:05:59+05:30

శ్వేతగిరిపై వెలసిన వేణుగోపాలస్వామి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏటా భీష్మ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకూ కల్యాణోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం భీష్మ ఏకాదశి సందర్భంగా.. శాలిహుండం సమీపంలోని శ్వేతగిరిపై క్రతువు ప్రారంభం కానుంది. ఈ నెల 27 వరకూ యాత్ర కొనసాగనుంది.

వేణుగోపాలస్వామి ఆలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటి నుంచి వేణుగోపాలుని కల్యాణోత్సవాలు

హాజరుకానున్న వేలాది మంది భక్తులు

పూర్తయిన ఏర్పాట్లు

శాలిహుండం (గార), ఫిబ్రవరి 22: శ్వేతగిరిపై వెలసిన వేణుగోపాలస్వామి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏటా భీష్మ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకూ కల్యాణోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం భీష్మ ఏకాదశి సందర్భంగా.. శాలిహుండం సమీపంలోని శ్వేతగిరిపై క్రతువు ప్రారంభం కానుంది. ఈ నెల 27 వరకూ యాత్ర కొనసాగనుంది. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ల నుంచి వేలాది మంది భక్తులు హాజరవుతారు. ఇప్పటికే కొండపైకి భక్తులు తరలివచ్చారు. వాహనాలు, కాలినడకన చేరుకున్న భక్తులు వంశధార నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. కొండపైన రుక్మిణి సమేత వేణుగోపాల స్వామిని, కొండ మధ్యలో వీరవసంతేశ్వరస్వామిని, కొండ దిగువ ప్రాంతంలో వరదరాజస్వామిని, నరసింహస్వామి ఆలయాలను దర్శించుకోనున్నారు. మంగళవారం వేకువజామున స్వామి వారి ఉత్సవమూర్తులకు మేళతాళాలతో తిరువీధి నిర్వహిస్తారు. వంశధార నదిలో చక్రస్నానాలు చేయిస్తారు.  ఆలయ ట్రస్ట్‌ బోర్డు అధ్యక్షుడు సుగ్గు మధురెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ, ప్రసాదం, తాగునీరు అందించనున్నాయి. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. వైద్య ఆరోగ్య శాఖ శిబిరాలను ఏర్పాటు చేయనుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీఐ అంబేడ్కర్‌, ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు. 

Updated Date - 2021-02-23T05:05:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising