ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుండపోత

ABN, First Publish Date - 2021-10-17T05:42:29+05:30

అల్పపీడన ప్రభావంతో జిల్లాలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు జలమయమై.. వరదనీరు ప్రవహిస్తోంది. వాగులు పొంగి ప్రవహించి.. పంటలు ముంపునకు గురవుతున్నాయి. శనివారం టెక్కలి డివిజన్‌ కేంద్రంలో కుండపోత వర్షం కురిసింది. ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

టెక్కలి : సంతోషిమాత ఆలయం దగ్గర వరదనీటితో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- టెక్కలిలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం 

- జలయమమైన రహదారులు

- పొంగుతున్న వాగులు

- ముంపునకు గురైన పంటలు

టెక్కలి/ కోటబొమ్మాళి, అక్టోబరు 16: అల్పపీడన ప్రభావంతో జిల్లాలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు జలమయమై.. వరదనీరు ప్రవహిస్తోంది. వాగులు పొంగి ప్రవహించి.. పంటలు ముంపునకు గురవుతున్నాయి. శనివారం టెక్కలి డివిజన్‌ కేంద్రంలో కుండపోత వర్షం కురిసింది. ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో నీరంతా రోడ్లపై నిలిచిపోయింది. జడ్పీ రోడ్డు, పాత జాతీయ రహదారి, చిన్నబజారు, ఎన్టీఆర్‌ కాలనీ, మండా పొలం కాలనీ, బాపారెడ్డి కాలనీ, భవానీనగర్‌, అయ్యప్పనగర్‌ తదితర ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. సంతోషిమాత గుడి వద్ద, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సమీపంలో చేరిన వరద నీరు మూలంగా ద్విచక్ర వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలువలు పొంగిపొర్లి చెత్తంతా రోడ్లపై చేరింది. ఎటుచూసినా వరదనీరే కనిపించింది.  నౌపడ-మెళియాపుట్టి రోడ్డులో నాలుగు రోడ్ల కూడలి వద్ద వరదనీరు భారీగా చేరింది. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. టెక్కలి తహసీల్దార్‌, సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలతో పాటు తొలుసూరుపల్లి రోడ్డులో మోకాలి లోతు వరదనీరు ప్రవహించడంతో అత్యవసర సేవలకు సైతం అంతరాయం ఏర్పడింది. టెక్కలి, కోటబొమ్మాళి మండలాల్లో వందలాది ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. కోటబొమ్మాళి నుంచి సంతబొమ్మాళి వెళ్లే మార్గంలో ఉన్న మంగలి గెడ్డ శుక్రవారం నుంచి పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఈ రెండు మండలాల్లో జనజీవనం స్తంభించింది. యలమంచిలి పంచాయతీ పరిధి గురువెల్లిపేట వద్ద నిర్మించిన రైల్వే అండర్‌పాస్‌ నుంచి భారీగా వరద నీరు రావడంతో ఆ గ్రామానికి ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  

Updated Date - 2021-10-17T05:42:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising