ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలలు.. పునః ప్రారంభం

ABN, First Publish Date - 2021-08-17T05:33:38+05:30

ప్రభుత్వ పాఠశాలలు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. సుదీర్ఘ విరామం తర్వాత తెరచుకోవడంతో విద్యార్థుల్లో సందడి నెలకొంది. కొవిడ్‌ నిబంధనల నడుమ ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించారు. ముందుగా తరగతి గదులను శానిటైజ్‌ చేయించారు. విద్యార్థులకు థర్మల్‌ పరీక్షలు నిర్వహించి.. తరగతి గదుల్లోకి అనుమతించారు. జిల్లావ్యాప్తంగా తొలిరోజు కొంతమంది విద్యార్థులకు ఎమ్మెల్యేలు, నాయకుల చేతులమీదుగా విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు. వివిధ పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనులు పూర్తికాకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు.

శ్రీకాకుళంలో పాఠశాలకు హాజరైన విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కొవిడ్‌ నిబంధనల నడుమ తరగతుల నిర్వహణ

- కొంతమంది విద్యార్థులకు విద్యాకానుక కిట్ల పంపిణీ

- అసంపూర్తిగా ‘నాడు-నేడు’ పనులు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ పాఠశాలలు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. సుదీర్ఘ విరామం తర్వాత తెరచుకోవడంతో విద్యార్థుల్లో సందడి నెలకొంది. కొవిడ్‌ నిబంధనల నడుమ ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించారు. ముందుగా తరగతి గదులను శానిటైజ్‌ చేయించారు. విద్యార్థులకు థర్మల్‌ పరీక్షలు నిర్వహించి.. తరగతి గదుల్లోకి అనుమతించారు. జిల్లావ్యాప్తంగా తొలిరోజు కొంతమంది విద్యార్థులకు ఎమ్మెల్యేలు, నాయకుల చేతులమీదుగా విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు.  వివిధ పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనులు పూర్తికాకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఉదాహరణకు పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  30 శాతం పనులు పూర్తికావల్సి ఉంది. తాగునీటి సదుపాయం లేదు. తరగతి గదులు పూర్తి ్తకాకపోవడంతో బెంచీలు ఏర్పాటు చేయలేదు. పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులు సాగుతున్నాయి. జిల్లాలో అనేక పాఠశాలల్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు అరకొర సౌకర్యాల మధ్య విద్యనభ్యసించారు.  


తొలిరోజు 15 శాతం హాజరు

జిల్లాలో తొలిరోజున ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కేవలం 15 శాతం విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2,74,627 మంది విద్యార్థులకుగానూ 46,840 మంది.. అంటూ 17 శాతం హాజరయ్యారు. ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 1,02,965 మంది విద్యార్థులకుగానూ 12,589 (12 శాతం) మంది హాజరయ్యారు. మొత్తంగా 59,429 మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. 

Updated Date - 2021-08-17T05:33:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising