ఆర్టీసీ పురోభివృద్ధికి తోడ్పడాలి
ABN, First Publish Date - 2021-10-22T05:21:47+05:30
ఆర్టీసీ పురోభి వృద్ధికి అందరూ తోడ్పాలని ఆ సంస్థ నార్త్ ఈస్ట్‌కోస్ట్(ఎన్‌ఈసీ) రీజనల్ మేనేజర్ ఎ.విజయకు మార్ కోరారు.
గుజరాతీపేట: ఆర్టీసీ పురోభి వృద్ధికి అందరూ తోడ్పాలని ఆ సంస్థ నార్త్ ఈస్ట్‌కోస్ట్(ఎన్‌ఈసీ) రీజనల్ మేనేజర్ ఎ.విజయకు మార్ కోరారు. ఆర్‌ఎంగా బాధ్యత లు చేపట్టిన తరువాత తొలిసారిగా గురువారం శ్రీకాకుళం ఆర్టీసీ బస్ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. టిక్కెట్ బుకింగ్ కౌంటర్లను పరిశీ లించారు. బస్‌స్టాండ్‌లోని అన్ని షాపుల వద్ద ధరల పట్టికలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు డివిజనల్ మేనేజర్ జి.వరలక్ష్మి, డిపోమేనేజర్లు ప్రవీణ, కవిత, ఆర్టీసీ డిస్పెన్షరీ వైధ్యాధికారి కింతలి కిరణ్‌కుమార్, డిప్యూటీ ఇంజనీర్ బి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-22T05:21:47+05:30 IST