ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గులాబ్‌ విలయం.. తీరని కష్టం

ABN, First Publish Date - 2021-09-29T05:41:13+05:30

‘గులాబ్‌’ తీవ్రత జిల్లాలో ప్రస్ఫుటంగా కనిపించింది. తుఫాన్‌ ధాటికి ఈదురుగాలులు, భారీ వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధాన పంటలైన వరితో పాటు మొక్కజొన్న, చెరకు, అరటి, బొప్పాయి, కంది, పత్తి పంటలు వరద నీటిలో మునగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇలా గే నీరు బయటకు రోజుల తరబడి వెళ్లకుంటే పంటలను నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు.

లావేరు : పెదలింగాలవలసలో జొన్న పొత్తులను పరిశీలిస్తున్న జేసీ సుమిత్‌ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీటిలోనే వరి, మొక్కజొన్న, అరటి, కంది, పత్తి పంటలు

ఇంకా తగ్గని వరద ప్రభావం 

పలు గ్రామాల్లో రాకపోకలకు ఇబ్బందులు 

 పంటలకు తీవ్ర నష్టం 

 పరిశీలించిన అధికారులు

(ఆంధ్రజ్యోతి బృందం)

‘గులాబ్‌’ తీవ్రత జిల్లాలో ప్రస్ఫుటంగా కనిపించింది. తుఫాన్‌ ధాటికి ఈదురుగాలులు, భారీ వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధాన పంటలైన వరితో పాటు మొక్కజొన్న, చెరకు, అరటి, బొప్పాయి, కంది, పత్తి పంటలు వరద నీటిలో మునగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇలా గే నీరు బయటకు రోజుల తరబడి వెళ్లకుంటే పంటలను నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. వేలాది ఎకరాల పంట నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా తుఫాన్‌ ప్రభావం, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రధాన నదులైన నాగావళి, వంశధార, సువర్ణముఖి తదితర నదులతో పాటు గెడ్డల్లో వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రా మాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రధాన రహదారులపై నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రజలు నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడ్డా రు. వరదనీరు పాఠశాలలు, కార్యాలయాల ఆవరణలో నీరుచేరి ఇబ్బందులు ఎదురయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఇదిలా ఉండ గా మూడోరోజు కూడా జిల్లాలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురి యడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.  నష్టపోయిన పంటలను అధికారులు పరిశీలించారు.

 

Updated Date - 2021-09-29T05:41:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising