ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుగు పయనం!

ABN, First Publish Date - 2021-01-18T05:12:17+05:30

డుగకు స్వగ్రామాలకు వచ్చిన వారు ఎక్కువ మంది ఆదివారం తిరుగు పయనమయ్యారు. దీంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతూ కనిపించాయి. శ్రీకాకుళం, పలాస, టెక్కలి, పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా కనిపించింది. పరిమిత రైళ్లు నడుస్తుండడంతో ఎక్

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ప్రయాణికుల రద్దీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 17: పండుగకు స్వగ్రామాలకు వచ్చిన వారు ఎక్కువ మంది ఆదివారం తిరుగు పయనమయ్యారు. దీంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతూ కనిపించాయి. శ్రీకాకుళం, పలాస, టెక్కలి, పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా కనిపించింది. పరిమిత రైళ్లు నడుస్తుండడంతో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడ్డారు. సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన కొంతమంది పండుగకు ముందుగానే రిజర్వేషన్‌ చేయించుకున్నారు. కాగా ఆదివారం శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రయాణికులతో నిండిపోయింది. నాన్‌స్టాప్‌ కౌంటర్‌ వద్ద క్యూలో ప్రయాణికులు బారులుదీరారు. గ్రామీణ బస్సుల్లో సైతం ప్రయాణికులు ఎక్కువగా కనిపించారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పెరిగాయి. దీంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. హైవే విస్తరణ పనులు జరుగుతుండడంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. చిలకపాలెం కొత్త టోల్‌ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు, వాహన చోదకులు అసౌకర్యానికి గురయ్యారు.




Updated Date - 2021-01-18T05:12:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising