ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల ఆరోగ్యంపై నివేదిక ఇవ్వండి

ABN, First Publish Date - 2021-06-16T05:15:27+05:30

శ్రీకాకుళం నగరంలోని సీతంపేట ఐటీడీఏకి చెందిన ఐఐటీ కోచింగ్‌ సెంటర్‌లో కరోనా కలకలంపై డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి స్పందించారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. పీవో సీహెచ్‌ శ్రీధర్‌తో డిప్యూటీ సీఎం ఫోన్‌లో మాట్లాడి వివ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




-ఐఐటీ కోచింగ్‌ సెంటర్లో కరోనా కలకలం 

-డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆరా

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూన్‌ 15 : 

శ్రీకాకుళం నగరంలోని సీతంపేట ఐటీడీఏకి చెందిన ఐఐటీ కోచింగ్‌ సెంటర్‌లో కరోనా కలకలంపై డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి స్పందించారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. పీవో సీహెచ్‌ శ్రీధర్‌తో డిప్యూటీ సీఎం ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  వైటీసీలో శిక్షణ పొందుతున్న వారిలో సగం మంది మాత్రమే గిరిజన విద్యార్థులు ఉన్నారని...మిగతా బీసీ వర్గాల వారు శిక్షణ పొందుతున్నారని పీవో వివరించారు.   విద్యార్థులు ఎటువంటి అనారోగ్యానికి గురికాలేదన్నారు. విద్యార్థులకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఒక నివేదిక అందించాలని సూచించారు. 

 విద్యార్థులు క్షేమం : పీవో శ్రీధర్‌

వైటీసీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు క్షేమంగా ఉన్నట్టు ఐటీడీఏ పీవో శ్రీధర్‌ తెలిపారు. వైటీసీలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వదంతులను నమ్మవద్దని  తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులంతా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.  నాణ్యమైన భోజనం, ఇతరత్రా సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే శిక్షణ కొనసాగుతోందన్నారు. నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులను చూడాలని విద్యార్థులు కోరడంతో మే 25 తరువాత సెలవులు ఇచ్చామని చెప్పారు. అందులో 28 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందన్నారు. వారందరికీ ప్రత్యేక గదుల్లో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచామని వెల్లడించారు.. విద్యార్థులంతా కోలుకుంటున్నారని చెప్పారు.  


11111111111111111111111111111


Updated Date - 2021-06-16T05:15:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising