ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీ‘డీలా’!

ABN, First Publish Date - 2021-05-13T05:27:58+05:30

ద్దానం జీడి పిక్కపై కరోనా ప్రభావం పడుతోంది. సీజన్‌ ప్రారంభంలోనే 80 కిలోల జీడి పిక్కల బస్తా రూ.6,700 నుంచి రూ.7200 ధర పలకడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఐదేళ్లపాటు తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో పంటలు రాలేదు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చినా ధర లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. సా

పీలింగ్‌కు సిద్ధమైన జీడి పిక్కలు..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50





తగ్గిన జీడిపిక్కల ధరలు

లబోదిబోమంటున్న రైతులు 

పలాస, మే 11: ఉద్దానం జీడి పిక్కపై కరోనా ప్రభావం పడుతోంది. సీజన్‌ ప్రారంభంలోనే 80 కిలోల జీడి పిక్కల బస్తా రూ.6,700 నుంచి రూ.7200 ధర పలకడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఐదేళ్లపాటు తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో పంటలు రాలేదు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చినా ధర లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. సాధారణంగా కొత్త పిక్కలు ప్రారంభంలో రేటు అధికంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది ధర తగ్గిందని వాపోతున్నారు. జిల్లాలో 34వేల హెక్టార్లలో జీడి పిక్కలు పండిస్తున్నారు. ఎకరాకు సరాసరి నాలుగు బస్తాల వరకు దిగుబడి వస్తుంది. ఒక్కో ఎకరాకు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు పెట్టుబడి అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ధర చూస్తే.. కనీసం తమ పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు పేర్కొంటున్నారు. ఇతర జిల్లాలకు చెందిన జీడి పిక్కలు రూ.6200కు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం ఆ పిక్కలతో పాటు స్థానిక పిక్కలను రూ.500 ధర ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పిక్కల ధర పడిపోగా.. పప్పు ధర మాత్రం రోజురోజుకు పెరుగుతుండడం విశేషం. ఈ ఏడాది 80 కిలోల జీడి పిక్కల బస్తాకు కనీసం రూ.16వేలు మద్దతు ధర చెల్లించాలని ఉద్దానం జీడి పిక్కల పోరాటకమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపింది. అందులో సగం ధర కూడా ప్రస్తుతం లేకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై సాధనకమిటీ ప్రతినిధులు వంకల మాధవరావు, మద్దిల రామారావు, బత్తిన హేమేశ్వరరావులు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ప్రభుత్వమే ధరలు నిర్ణయించి.. కనీస మద్దతుగా బస్తాకు రూ.16వేలు చెల్లిస్తే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయంపై  మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజుకు, కలెక్టర్‌ నివాస్‌కు కూడా లేఖ అందజేశామని తెలిపారు.  



Updated Date - 2021-05-13T05:27:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising