ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిర్యాదుదారులతో మర్యాదగా మెలగాలి

ABN, First Publish Date - 2021-01-16T05:37:30+05:30

పోలీసు స్టేషన్‌లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్‌ పోలీసు స్టేషన్‌లో అధునాతన హంగులతో నిర్మించిన రిసెప్షన్‌ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ప్రజలు తమ సమస్యలపై స్టేషన్‌కు వచ్చేటప్పుడు వారికి చక్కటి వాతావరణం కల్పించడ మే ఈ రిసెప్షెన్‌ కేంద్రాల ప్రధాన ఉద్దేశ మన్నారు.

శ్రీకాకుళం రూరల్‌ పోలీసు స్టేషన్‌లో రిసెప్షన్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎస్పీ అమిత్‌బర్దర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  ఎస్పీ అమిత్‌బర్దర్‌ 

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/ఎచ్చెర్ల, జనవరి 15: పోలీసు స్టేషన్‌లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్‌ పోలీసు స్టేషన్‌లో అధునాతన హంగులతో నిర్మించిన రిసెప్షన్‌ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ప్రజలు తమ సమస్యలపై స్టేషన్‌కు వచ్చేటప్పుడు వారికి చక్కటి వాతావరణం కల్పించడ మే ఈ రిసెప్షెన్‌ కేంద్రాల ప్రధాన ఉద్దేశ మన్నారు. నిర్భయ నిధులతో జిల్లాలో 35 స్టేషన్లలో రిసెప్షన్‌ సెంటర్‌లు ఏర్పా టు చేస్తున్నామన్నారు. అర్జీదారులతో మాట్లాడి వారికి మనో ధైర్యం ముందుగా కల్పిం చాలని ఎస్పీ స్పష్టంచేశారు. అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, టౌన్‌ డీఎ స్పీ మహేంద్ర, సీఐ అంబేడ్కర్‌,  జేఆర్‌పురం సీఐ చంద్రశేఖర్‌, ఎచ్చెర్ల ఎస్‌ఐ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


దేవాలయాల భద్రత అందరి బాధ్యత 

శ్రీముఖలింగం (జలుమూరు): దేవాలయాల భద్రత, రక్షణ బాధ్యత మనందరిపై ఉందని ఎస్పీ అమిత్‌ బర్దర్‌ అన్నారు. శ్రీముఖలింగంలో శుక్రవారం గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాల భద్రతకు దేవాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. శ్రీముఖలింగంలో ప్రధాన దేవాలయం మధుకేశ్వరస్వామికి సీసీ కెమెరాలు ఉన్నందున మిగిలిన దేవాలయాల్లోనూ ఏర్పాటుకు కమిటీలు, దేవదాయ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. దేవాలయాలకు భద్రత కోసం శాఖా పరంగా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎం.మహేంద్ర, ఈవో ఎన్‌.వి.రమణయ్య,  అర్చకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అనంతరం శ్రీముఖలింగేశ్వర స్వామిని కుటుం బ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేదమంత్రాలతో పూజలు చేసి అభిషేకం చేయించారు. స్వామివారి శేష వస్త్రాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ చరిత్రను వివరించారు. 

 

 

Updated Date - 2021-01-16T05:37:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising