ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్ధలతో రాజమ్మ సంబరాలు

ABN, First Publish Date - 2021-03-01T05:40:32+05:30

మ్మ నామస్మరణతో వత్సవలస మార్మోగింది. భక్తజనంతో పులకించిపోయింది. ఆదివారం రాజరాజేశ్వరి (రాజమ్మ) సంబరాలు ఘనంగా

వత్సవలసలో భక్తజన సందోహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




 వేలాది తరలివచ్చిన భక్తజనం

 వత్సవలస (గార), ఫిబ్రవరి 28 రాజమ్మ నామస్మరణతో వత్సవలస మార్మోగింది. భక్తజనంతో పులకించిపోయింది. ఆదివారం రాజరాజేశ్వరి (రాజమ్మ) సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సాయంత్రానికే ఆలయ ప్రాంగణానికి భక్తులు పెద్దఎత్తున చేరుకున్నారు. ఆదివారం వేకువజామున సముద్రంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నానికి అమ్మవారు పీఠాలు భక్తులతో కిక్కిరిశాయి. వాహనాలతో రహదారులు నిండిపోయాయి. సీఐ అంబేద్కర్‌, ఎస్‌ఐ హరికృష్ణలు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా చర్యలు చేపట్టారు. వత్సవలస చేరుకునే వాహనాలను కొర్ని, తూలుగు రోడ్లు మీదుగా అనుమతించారు. తిరిగి వత్సవలస నుంచి వెళ్ళే వాహనాలను శ్రీకూర్మం వైపు మళ్లించారు. సముద్ర స్నానాల వద్ద  మెరైన్‌ సీఐ గోవిందరావు ఆధ్వర్యంలో సిబ్బంది పర్యవేక్షించారు.





Updated Date - 2021-03-01T05:40:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising