ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరితగతిన ‘నాడు-నేడు’ పనులు

ABN, First Publish Date - 2021-06-20T05:36:16+05:30

పాఠశాలల్లో ‘నాడు-నేడు’ కింద చేపడుతున్న పనులను వెంటనే పూర్తిచేయాలని విద్యాశాఖ ఆర్జేడీ కె.నాగేశ్వరరావు (కాకినాడ) ఆదేశించారు. శనివారం మడ్డువలస గురుకులం, ప్రాథమిక పాఠశాల, మద్దివలస, అరసాడ పాఠశాలల్లో చేపట్టిన పనులను పరిశీలించారు.

మడ్డువలస గురుకులంలో గోడలపై చిత్రాలను పరిశీలిస్తున్న ఆర్జేడీ నాగేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆర్జేడీ నాగేశ్వరరావు 

వంగర, జూన్‌ 19: పాఠశాలల్లో ‘నాడు-నేడు’ కింద చేపడుతున్న పనులను వెంటనే పూర్తిచేయాలని విద్యాశాఖ ఆర్జేడీ కె.నాగేశ్వరరావు (కాకినాడ) ఆదేశించారు. శనివారం మడ్డువలస గురుకులం, ప్రాథమిక పాఠశాల, మద్దివలస, అరసాడ పాఠశాలల్లో చేపట్టిన పనులను పరిశీలించారు. ముందుగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, తరగతి గదులు, క్రీడా ప్రాంగణాలను పరిశీలించారు. పిల్లలను ఆకట్టుకునేలా పాఠశాలలను తీర్చిదిద్దాలని, తరగతి గదుల్లో మంచి బోర్డులను ఏర్పాటు చేయాలని ఎంఈవో దుర్గారావుకు సూచించారు. మరుగుదొడ్లు, తాగునీటికి ఇబ్బంది లేకుడా చర్యలు చేపట్టాలన్నారు. గోడలపై వేసిన చిత్రాలు పాడవకుండా సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభానికి అవకాశం ఉండడంతో జిల్లాలో అన్ని పాఠశాలల్లో పనులు చివరిదశలో ఉన్నాయన్నారు. డిప్యూటీ డీఈవో బ్రాహ్మాజీ పాల్గొన్నారు. 


పనుల పురోగతిపై సమీక్ష

టెక్కలి: పాఠశాలల్లో చేపడుతున్న ‘నాడు-నేడు’ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పి.వెంకటరమణ ఆదే శించారు. శనివారం ఎంఆర్‌సీ కేంద్రంలో ఆయా పాఠ శాలల హెచ్‌ ఎంలతో సమావేశం నిర్వహించి పాఠశాలల వారీగా సమీక్షించారు. సమావేశంలో ఎంఈవో దేవేంద్రరావు, పలు పాఠశాలల హెచ్‌ఎంలు  తదితరులు పాల్గొన్నారు.

 

 

Updated Date - 2021-06-20T05:36:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising