ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ విధానాలతోనే విద్యుత్‌ కష్టాలు

ABN, First Publish Date - 2021-10-15T05:12:06+05:30

రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లే విద్యుత్‌ కష్టాలు ప్రారంభమయ్యా యని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు విమర్శించారు.

లావేరు: దుర్గాదేవిని దర్శించుకుంటున్న కళా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు 

ఎచ్చెర్ల: రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లే విద్యుత్‌ కష్టాలు ప్రారంభమయ్యా యని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు విమర్శించారు. కింతలిమిల్లు జంక్షన్‌లో నివాసముంటున్న టీడీపీ పార్లమెంటరీ  అధికార ప్రతినిధి పైడి ముఖలింగం తల్లి పోలమ్మ ఇటీవల మృతి చెందారు.  గురువారం ముఖలింగం కుటుంబాన్ని కళావెంకట రావు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పిన సీఎం జగన్‌.. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఆ హామీని విస్మరించా రన్నారు. విద్యుత్‌ చార్జీలను కూడా పెంచి, ప్రజల నెత్తిన భారం మోపుతున్నారన్నారు.   కార్యక్రమంలో టీడీపీ నేతలు వావిలిపల్లి రామకృష్ణ, మెండ రాజారావు, కొత్తకోట సురేంద్ర, బోర శ్రీనివాసరావు, పైడి అన్నంనాయుడు, మూకళ్ల భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.

లావేరు: శరన్నవరాత్రి ఉత్స వాల్లో భాగంగా బుడుమూరులో ఏర్పాటు చేసిన దుర్గాదేవిని  గురువారం  కిమిడి కళావెంకటరావు దర్శించుకున్నారు. కార్య క్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్‌,  జడ్పీ టీసీ మాజీ సభ్యులు పిన్నింటి మధుబాబు, రాజాపంతుల ప్రకాశరావు, నాయకులు నల్లి లక్ష్ముంనాయుడు, గోపాలరావు, దన్నాన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-10-15T05:12:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising