పొందూరు ఖాదీ ఖ్యాతిని పెంచాలి
ABN, First Publish Date - 2021-10-30T05:16:25+05:30
పొందూరు ఖాదీ ఖ్యాతిని పెంచాలి
- స్పీకర్ తమ్మినేని సీతారాం
పొందూరు : పొందూరు చేనేత, ఖాదీ వస్త్రాలకు విశ్వవ్యాప్తంగా మరింత ఖ్యాతి పెంచాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆకాంక్షించారు. మండల కేంద్రంలో సాయి బాబా చేనేత సొసైటీ ఆవరణలో ప్రతిపాదిత చేనేత క్లస్టర్‌పై నిర్వహించిన అవగా హన సదస్సులో స్పీకర్ పాల్గొని మాట్లాడారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతేక్యంగా దృష్టి సారించిందన్నారు. కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ మాట్లాడుతూ... ఇప్పటికే రూ.100 కోట్లతో పొందూరులో మెగా చేనేత క్లస్టర్ ఏర్పా టుకు ప్రతిపాదనలు ఉన్నాయని, యువత చేనేత రంగంలో చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వస్తే ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. పొందూరు చేనేత, ఖాదీ కార్మికుల ప్రతిభకు సాంకేతికత తోడైతే ప్రపంచంలోనే నాణ్యమైన వస్త్రాలను అందించే సత్తా పొందూరుకు ఉందన్నారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు పెం చేందుకు మెగా క్లస్టర్ తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో చేనేత జౌళ్లశాఖ ఆర్‌డీడీ ధనుంజయరావు, ఏడీ షరీఫ్, ఎంపీపీ కిల్లి ఉషారాణి, జడ్పీటీసీ ఎల్.కాంతారావు, సర్పంచ్ ఆర్.లక్ష్మి, వైసీపీ నాయకులు చిరంజీవి నాగ్, బీజేపీ చేనేత విభాగం రాష్ట్ర సభ్యులు బి.ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుండగా తమ సొసైటీలో పేరుకుపోయిన వస్త్రనిల్వలను ఆప్కో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని తో లాపి శ్రీగౌరీ శంకర చేనేత సొసైటీ సభ్యులు స్పీకర్, కలెక్టర్‌ను కోరుతూ వినతిపత్రం అందించారు. సుమారు రూ.20 లక్షలు విలువైన చేనేత వస్త్రనిల్వలు ఉన్నాయన్నారు.
Updated Date - 2021-10-30T05:16:25+05:30 IST