ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి పథకంపై రాజకీయం తగదు

ABN, First Publish Date - 2021-02-27T05:17:03+05:30

జగన్నాథవలస గ్రామంలో రక్షిత నీటి పథకం నుంచి రాజకీయం పేరుతో ప్రజలకు తాగునీరందనీయకుండా చే యడం తగదని, ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ డీఈఈ వైకుంఠరావు హెచ్చరించారు. తాగునీటి పథకం నుంచి నీరు రాకుండా అడ్డుకుంటున్నారన్న ఫిర్యాదుపై శుక్రవారం గ్రామంలో నీటి పథకాన్ని పరిశీలించి స్థానికులు, అధికారులతో మాట్లాడారు.

మాట్లాడుతున్న డీఈఈ వైకుంఠరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  అడ్డు తగిలితే  కేసులు తప్పవు: డీఈఈ వైకుంఠరావు  

వంగర, ఫిబ్రవరి 26: జగన్నాథవలస గ్రామంలో రక్షిత నీటి పథకం నుంచి రాజకీయం పేరుతో ప్రజలకు తాగునీరందనీయకుండా చే యడం తగదని, ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ డీఈఈ వైకుంఠరావు హెచ్చరించారు. తాగునీటి పథకం నుంచి నీరు రాకుండా అడ్డుకుంటున్నారన్న ఫిర్యాదుపై శుక్రవారం గ్రామంలో నీటి పథకాన్ని పరిశీలించి స్థానికులు, అధికారులతో మాట్లాడారు. మాజీ సర్పంచ్‌ పడాల నాగేశ్వరరావు.. గతంలో తాను పనిచేసిన బిల్లులు అంద లేదని, తన సొంత భూమిలో ఉన్న నేల బావి నుంచి ప్రజలకు నీరందిం చానని, ఇప్పుడు బిల్లులు అందని కారణంగా నిలుపుదల చేశానని చెప్పడంతో ఇది ఎంతమాత్రం సమంజసం కాదని డీఈఈ పేర్కొన్నారు. ఒకసారి ప్రభుత్వానికి అప్పగించిన భూమిపై ఎటువంటి హక్కులు ఉండవని డీఈఈ స్పష్టం చేశారు. మరలా నీటి పథకం నుంచి నీరు రాకుండా నిలుపుదల చేస్తే కేసులు నమోదు చేయాలని కార్యద్శి ధనుం జయ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ చరణలకు ఆదేశించారు. బిల్లులు రాకుంటే వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. 

 


 

Updated Date - 2021-02-27T05:17:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising