ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్‌ సిబ్బంది క్వార్టర్లు కూల్చివేత

ABN, First Publish Date - 2021-01-18T04:53:48+05:30

రాజాం మెయిన్‌రోడ్‌లోని పోలీసు సిబ్బంది నివాస గృహాలు (క్వార్టర్లు)ను కూల్చివేసే పనులు ప్రారంభమయ్యాయి.

జేసీబీతో భవనాలు కూలుస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం రూరల్‌, జనవరి 17: రాజాం మెయిన్‌రోడ్‌లోని పోలీసు సిబ్బంది నివాస గృహాలు (క్వార్టర్లు)ను కూల్చివేసే పనులు ప్రారంభమయ్యాయి. 1996లో పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన క్వార్టర్లను అప్పటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడి ్డప్రారంభించారు. కాలక్రమంలో ఆ భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో సిబ్బంది ఎవరూ వాటిలో ఉండకుండా ఖాళీ చేశారు. భవనాలు నివాసానికి అనుకూలంగా లేకపోవడంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇదిలా ఉండగా నూతనంగా నివాస గృహాల నిర్మాణానికి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో స్థలం కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది కిందట ఎస్పీ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే పాత క్వార్టర్ల స్థలం కోట్లాది రూపాయలు విలువచేస్తుందని, ఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టకుండా ఇతర ప్రాంతంలో చేపట్టడం వల్ల పలు అనుమానాలకు తావిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. పాత స్థలంలో నిర్మాణాలు చేపడితే బాగుంటుందని పలువురు సిబ్బంది కోరుతున్నారు.

Updated Date - 2021-01-18T04:53:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising